
సీనియర్ రాధికా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ , కృష్ణ , నాగేశ్వర్ రావు , చిరంజీవి , వెంకటేష్ తదితరాల హీరోలందరి పక్కన నటించి మెప్పించిన ఈమె..ప్రస్తుతం యంగ్ హీరోలకు తల్లి పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. తాజాగా ఈమె ఓ ఛానల్ ఇంటర్వ్యూ లో పాల్గొని అనేక విశేషాలను పంచుకుంది.
చిరంజీవి గురించి పలు ప్రశ్నలను అడుగగా…”ఆయన సెల్ఫ్‌మేడ్ మాన్. తన కష్టంతో ఎదిగిన వ్యక్తి. ఇప్పటికీ ఆయన అదే డెడికేషన్‌తో వర్క్ చేస్తున్నారు. ఆయనకు తల్లిగా అయితే చేయను. విలన్‌గా అయినా చేస్తాను. నేను నటిని ఎలాంటి పాత్రలయినా చేస్తాను”.. అని అన్నారు. అలాగే, తెలుగు హీరోలందరూ చాలా ఇష్టమని తెలిపిన రాధికా.. జూ. ఎన్టీఆర్‌కు ఫెంటాస్టిక్ ఎనర్జీ.. మహేష్‌బాబు, అల్లు అర్జున్, రామ్‌చరణ్ చిన్నతనం నుంచి నాకు తెలుసు. ఇప్పుడు వాళ్లని చూస్తుంటే చాలా గర్వంగా ఉందని తెలిపింది.