Homeటాప్ స్టోరీస్రివ్యూ : రాధే శ్యామ్ - బోరింగ్ జర్నీ

రివ్యూ : రాధే శ్యామ్ – బోరింగ్ జర్నీ

నటీనటులు ; ప్రభాస్ , పూజా హగ్దే , కృష్ణం రాజు , భాగ్యశ్రీ తదితరులు
డైరెక్టర్ : రాధాకృష్ణ
మ్యూజిక్ డైరెక్టర్ : జస్టిన్‌ ప్రభాకర్‌
నిర్మాతలు : భూషణ్ కుమార్, వంశీ ప్రమోద్, ప్రసీదా
రిలీజ్ డేట్ : మార్చి 11 , 2022
రేటింగ్ : 2.75/5

రాధే శ్యామ్ - బోరింగ్ జర్నీ
రాధే శ్యామ్ – బోరింగ్ జర్నీ

బాహుబలి, సాహో చిత్రాల తర్వాత ప్రభాస్ నుండి వచ్చిన మూవీ ‘రాధే శ్యామ్’. ఈ సినిమా కోసం అభిమానులు గత రెండేళ్లుగా కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తున్నారు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో ఇటలీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పై అంచనాలు తారాస్థాయిని మించి ఉన్నాయి. మరి అంచనాలకు తగ్గట్లు డైరెక్టర్ రాధాకృష్ణ చిత్రాన్ని తెరకెక్కించారా లేదా..? నిర్మాతల ఖర్చు కథ కు తగ్గవేనా..? థమన్ బ్యాక్ గ్రౌండ్ వర్క్ అవుట్ అయ్యిందా లేదా..? గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న పూజా ఏ మేరకు ఆకట్టుకుంది..? మన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ చించేసాడా..లేదా..? అనేది ఇప్పుడు పూర్తి రివ్యూ లో చూద్దాం.

- Advertisement -

కథ :

విక్రమాదిత్య (ప్రభాస్) గొప్ప జ్యోతిష్కుడు. చేయి చూసి భవిష్యత్ ఏంటి అనేది చెప్పేస్తాడు. ఈయన చెప్పాడంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. రోమ్ లో తల్లి (భాగ్యశ్రీ)తో కలిసి ఉంటాడు. ఓ రోజు ట్రైన్ లో ప్రేరణ (పూజా హగ్దే ) ను చూసి ప్రేమలో పడతాడు. అప్పటివరకు తన లైఫ్ లో ప్రేమ , పెళ్లి వంటికి చోటులేదని చెప్పే విక్రమాదిత్య ..ప్రేరణ ను ప్రేమించడం మొదలుపెడతాడు. ఆమె సైతం విక్రమాదిత్య తో ప్రేమలో పడుతుంది. ఓ రోజు ప్రేరణ చేయి చూసి వందేళ్లు జీవిస్తావని చెపుతాడు. కాకపోతే అప్పటికే ఆమె కాన్సర్ తో బాధపడుతుంటుంది. త్వరలోనే ఆమె చనిపోతానని ఆమెకు తెలుసు. కానీ విక్రమాదిత్య వందేళ్లు బ్రతుకుతావు అని చెప్పే సరికి అది ఎలా సాధ్యమవుతుందని అనుకుంటుంది. ఇదే క్రమంలో విక్రమాదిత్య గురించి ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. మరి ఆ విషయం ఏంటి..? ప్రేరణ చనిపోతుందా ..లేదా..? విక్రమాదిత్య కు పరమహంస (కృష్ణం రాజు ) కు సంబంధం ఏంటి..? అనే విషయాలు మీరు సినిమా చూస్తే తెలుస్తుంది.

ప్లస్ :

* చిత్ర నిర్మాణ విలువలు

* ప్రభాస్ – పూజా హగ్దే నటన

* థమన్ బ్యాక్ గ్రౌండ్

* సినిమాలోని సెట్స్

మైనస్ :

*కథ – కథనం

* స్లో నేరేషన్

* పాటలు

నటీనటుల తీరు :

* ఫస్ట్ టైం ప్రభాస్ పూర్తిగా క్లాస్ లుక్ లో కనిపించాడు. జోతిష్యుడు విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్‌ ఒదిగిపోయాడు. డాక్టర్‌ ప్రేరణగా పూజా హెగ్డే మెప్పించింది. ప్రభాస్ – పూజా ల జోడి బాగుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయ్యింది.

* విక్రమాదిత్య గురువు పరమహంస పాత్రంలో కృష్ణంరాజు ఆకట్టుకున్నాడు. హీరో తల్లిగా భాగ్యశ్రీ నటించింది.

* సచిల్‌ ఖేడ్‌కర్‌, ఓడ కెప్టెన్‌గా జయరాం, బిజినెస్‌ మ్యాన్‌గా జగపతిబాబుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

సాంకేతిక వర్గం :

* థమన్ మరోసారి తన బ్యాక్ గ్రౌండ్ తో మెప్పించాడు. ముఖ్యంగా ఈయన బ్యాక్ గ్రౌండ్ సినిమాకు ప్రాణం పోసిందనే చెప్పాలి.

* మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ సినిమాని మరో లెవల్‌కి తీసుకెళ్లింది. ప్రతి ఫ్రేమ్‌ అందంగా, అద్భుతంగా చూపించాడు.

* కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతం..ట్రైన్ సీన్ , క్లైమాక్స్ ఓడ సీన్లు ప్రేక్షకులను కట్టిపడేశాయి.

*జస్టిన్‌ ప్రభాకర్‌ సంగీతం(సౌత్‌ వర్షన్‌) ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.

* నిర్మాణ విలువలు కథకు మించి ఉన్నాయి. ఇలాంటి కథకు అంత ఖర్చు అవసరం లేదు. సొంత ప్రొడక్షన్ కావడం తో అంత ఖర్చు చేసినట్లు తెలుస్తుంది.

* ఎడిటింగ్ ఫై ఇంకాస్త శ్రద్ద పెట్టాల్సింది.

* ఇక డైరెక్టర్ రాధాకృష్ణ విషయానికి వస్తే..ఈ కథ కు ప్రభాస్ అవసరం లేదు. అంతటి ఇమేజ్ ఉన్న హీరో ఇలాంటి క్లాస్ మూవీ చేయడం అనవసరం. రాధాకృష్ణ ఎంతసేపు విజువల్ ఫై శ్రద్ద పెట్టాడు కానీ కథనం ఫై పెడితే బాగుండు. స్లో నేరేషన్..మాస్ ఎలిమెంట్స్ లేకపోవడం ప్రేక్షకులను నిరాశ పెట్టింది. కథ లో ట్విస్ట్ లు లేకపోవడం , కేవలం హీరో – హీరోయిన్ చుట్టూనే కథను నడిపించాడు. సినిమాలో పెద్ద స్టార్స్ ఉన్నప్పటికీ వారిని వాడుకోలేకపోయాడు.

ఫస్టాఫ్‌ అంతా స్లోగా సాగుతుంది. యూరప్‌ అందాలపైనే దర్శకుడు ఎక్కువ శ్రద్దపెట్టినట్లు అనిపిస్తుంది. ట్రైన్‌ సీన్‌ ఆకట్టుకుంటుంది. అలాగే హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే డెత్‌ ప్రాక్టీస్‌ సీన్‌ నవ్విస్తుంది. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. కానీ ఆ ఆసక్తిని సినిమా ఎండింగ్‌ వరకు కొనసాగించడంలో దర్శకుడు విఫలమయ్యాడు.

ఓవరాల్ గా ..రాధే శ్యామ్ బోరింగ్ జర్నీ

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All