Homeఎక్స్ క్లూసివ్విక్రమాదిత్య ఎవరో 23న చెబుతారట!!

విక్రమాదిత్య ఎవరో 23న చెబుతారట!!

విక్రమాదిత్య ఎవరో 23న చెబుతారట!!
విక్రమాదిత్య ఎవరో 23న చెబుతారట!!

రెబెల్ స్టార్ ప్రభాస్ నుండి వస్తోన్న రొమాంటిక్ ఎంటర్టైనర్ రాధే శ్యామ్. దాదాపు మూడేళ్ళ నుండి ప్రొడక్షన్ లో ఉన్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 14, 2022న ఈ చిత్రం విడుదలవుతుందని రీసెంట్ గా ప్రకటించారు. అయితే రాధే శ్యామ్ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారన్నది ఎవరూ కాదనలేని నిజం.

ఎందుకంటే ఈ మూడేళ్ళలో ఇప్పటివరకూ ఒక చిన్న టీజర్, కొన్ని పోస్టర్స్ తప్ప రాధే శ్యామ్ నుండి ప్రమోషనల్ మెటీరియల్ అన్నది ఏదీ విడుదల కాలేదు. అయితే కొన్ని రోజుల్లో దానికి తెరదించనున్నారు. రాధే శ్యామ్ టీజర్ విడుదల కాబోతోంది. అక్టోబర్ 23న ఉదయం 11 గంటల 16 నిమిషాలకు రాధే శ్యామ్ టీజర్ ను విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

- Advertisement -

విక్రమాదిత్య ఎవరో తెలుసుకోవాలంటే అప్పటివరకూ ఆగాలని నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ చెబుతోంది. ప్రభాస్ ఈ సినిమాలో విక్రమాదిత్య పాత్రలో కనిపించబోతున్నాడు. యూవీ క్రియేషన్స్ తో పాటు కృష్ణం రాజు గోపి కృష్ణ మూవీస్ కూడా నిర్మాణంలో భాగం పంచుకుంది.

మొత్తం ఐదు భాషల్లో రాధే శ్యామ్ విడుదల కానుంది. రాధా కృష్ణ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించాడు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేసాడు. ఈ పీరియాడిక్ రొమాంటిక్ డ్రామాలో హీరోయిన్ పూజ హెగ్డే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All