Homeటాప్ స్టోరీస్మొత్తానికి షూటింగ్ పూర్తి చేసుకున్న రాధే శ్యామ్

మొత్తానికి షూటింగ్ పూర్తి చేసుకున్న రాధే శ్యామ్

మొత్తానికి షూటింగ్ పూర్తి చేసుకున్న రాధే శ్యామ్
మొత్తానికి షూటింగ్ పూర్తి చేసుకున్న రాధే శ్యామ్

రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ షూటింగ్ ఎట్టకేలకు పూర్తయింది. ఈ సినిమా షూటింగ్ ఏకంగా మూడేళ్ళ క్రితం మొదలైంది. అప్పటినుండి అది సాగుతూనే ఉంది. మధ్యలో కరోనా వైరస్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ కు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈలోగా ప్రభాస్ ఫ్యాన్స్ లో తీవ్ర అసహనం కూడా కలిగింది.

రాధే శ్యామ్ కు సంబంధించిన అప్డేట్స్ కావాలని సోషల్ మీడియాలో గొడవ చేయడం మొదలుపెట్టారు. ఏదైతేనేం, ప్రభాస్ అభిమానులకు ఊరటనిచ్చే విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. రాధే శ్యామ్ షూటింగ్ ఎట్టకేలకు పూర్తయింది. ఈ విషయాన్ని దర్శకుడు రాధా కృష్ణ కుమార్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసాడు.

- Advertisement -

ఈ క్రమంలోనే రాధే శ్యామ్ విడుదల తేదీని అధికారికంగా రేపు ప్రకటించనున్నారు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ పీరియాడిక్ లవ్ డ్రామాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All