Homeటాప్ స్టోరీస్ఆశ్చర్యం కలిగిస్తున్న రాధే శ్యామ్ రన్ టైం ..

ఆశ్చర్యం కలిగిస్తున్న రాధే శ్యామ్ రన్ టైం ..

radhe shyam run time
radhe shyam run time

దాదాపు మూడేళ్లుగా డార్లింగ్ అభిమానులు , సినీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న రాధే శ్యామ్ మరో వారం లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటివరకు విడుదలైన టీజర్, ట్రైలర్స్ , మేకింగ్ , స్టిల్స్ ఇలా ప్రతిదీ సినిమా ఫై అంచనాలు పెంచేయడం తో సినిమాను ఎప్పుడెప్పుడా చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. మొన్నటి వరకు సైలెంట్ గా చిత్ర యూనిట్…ప్రస్తుతం ప్రమోషన్స్ తో స్పీడ్ పెంచారు. ఇప్పటికే ప్రభాస్ , పూజా హగ్దే లు ముంబై లో చక్కర్లు కొడుతూ సినిమాకు బజ్ తీసుకొచ్చే పనిలో ఉన్నారు.

మరోపక్క చిత్ర మేకర్స్ మిగతపనుల్లో బిజీ గా ఉన్నారు. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసారు. సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు సినిమాకు U/A సర్టిఫికెట్ జారీ చేసారు. అలాగే సినిమా మొత్తం నిడివి 2 గంటల 18 నిమిషాలుగా తేల్చారు. సినిమా విజువల్ ట్రీట్ అని , హాలీవుడ్ సినిమాను తలపించేలా సినిమా ఉందని, క్లైమాక్స్ గురించి ఎంత చెప్పిన తక్కువే అని , ప్రభాస్ ఈ మూవీ తో హాలీవుడ్ రేంజ్ కి వెళ్లడం ఖాయం అని చెప్పినట్లు తెలుస్తుంది. ఇక సెన్సార్ టాక్ తో చిత్ర యూనిట్ సంబరాల్లో తేలుతున్నారు. ఇక పీరియాడిక్ లవ్ స్టోరీ గా ఈ చిత్రాన్ని `జిల్` ఫేం రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేయగా, యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All