Homeటాప్ స్టోరీస్రాధే శ్యామ్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్..?

రాధే శ్యామ్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్..?

radhe shyam ott release date
radhe shyam ott release date

రాధే శ్యామ్ మూవీ ఇంకా ప్రేక్షకుల ముందుకు రానేలేదు..అప్పుడే మీడియా లో ఓటిటి రిలీజ్ వార్త చక్కర్లు కొడుతోంది. దాదాపు మూడేళ్లుగా డార్లింగ్ అభిమానులు , సినీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న రాధే శ్యామ్ మరో వారం లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటివరకు విడుదలైన టీజర్, ట్రైలర్స్ , మేకింగ్ , స్టిల్స్ ఇలా ప్రతిదీ సినిమా ఫై అంచనాలు పెంచేయడం తో సినిమాను ఎప్పుడెప్పుడా చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. మొన్నటి వరకు సైలెంట్ గా చిత్ర యూనిట్…ప్రస్తుతం ప్రమోషన్స్ తో స్పీడ్ పెంచారు.

ఇక ఈ మూవీ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ముందుగా ఒప్పందం చేసుకున్న ప్రకారం సినిమా థియేటర్స్ లోకి వచ్చిన 50 రోజుల తర్వాతనే ఓటిటి విడుదల చేయాల్సి ఉంటుంది. రాధేశ్యామ్ సినిమా 11వ తేదీన విడుదలైన తర్వాత పాజిటివ్ టాక్ వస్తే మాత్రం పది రోజుల పాటు ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ తో మంచి క్రేజ్ అందుకుంటుంది అని చెప్పవచ్చు. అయితే మార్చి 25 వ తేదీ ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల అవుతుంది కాబట్టి ఆ సినిమా హడావిడిలో రాధేశ్యామ్ హావా తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే ఏప్రిల్ మొదటి వారంలోనే సినిమాను ఓటిటి లో రిలీజ్ చేయాలనీ చూస్తున్నారట. మరి నిజంగా అలాగే రిలీజ్ చేస్తారో..లేక మరికొద్ది రోజుల తర్వాత చేస్తారో తెలియదు కానీ ప్రస్త్తుతం మాత్రం ఓటిటి రిలీజ్ వార్త తెగ చక్కర్లు కొడుతుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All