
బాహుబలి , సాహో చిత్రాల తర్వాత ప్రభాస్ నుండి వచ్చిన చిత్రం రాధే శ్యామ్. రాధాకృష్ణ డైరెక్ట్ చేయగా యువీ క్రియేషన్స్ వారు నిర్మించారు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా వల్ల నిర్మాతలు ఏమి నష్టపోలేదు కానీ బయ్యర్లు మాత్రం నష్టపోయారు. దీంతో వారిని ఆదుకునేందుకు ప్రభాస్ ముందుకు వచ్చారు.
ఇక ఇదిలా ఉంటె ఈ సినిమా ఇప్పుడు ఓటిటి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఏప్రిల్ 01 నుండి అమెజాన్ లో స్ట్రీమింగ్ మొదలు కాబోతున్నట్లు అధికారిక ప్రకటన చేసారు. థియేటర్స్ లలో సందడి చేయలేకపోయినా ఈ మూవీ ఓటిటి లో ఏ రేంజ్ లో సందడి చేస్తుందో చూడాలి.
- Advertisement -