
టీఎస్ ఆర్టీసీ ఎండీ గా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుండి సజ్జనార్ తనదైన మార్క్ చూపిస్తూ ప్రయాణికులను ఆకట్టుకున్నాడు. ప్రవైట్ ట్రావెల్స్ కు ఏమాత్రం తగ్గకుండా టికెట్ ఆఫర్లు ప్రకటించడమే కాదు సోషల్ మీడియా ను కూడా గట్టిగా వాడుకుంటూ ఆర్టీసీ ని లాభాల్లో తెచ్చేందుకు కృషి చేస్తున్నాడు. ఇరాక్ అగ్ర హీరోల సినిమాల తాలూకా పిక్స్ , సీన్స్ ను వాడుకుంటూ ఆర్టీసీ బస్సు క్షేమంగా గమ్య తీరాలకు చేరుస్తుందంటూ మీమ్స్ వదులుతూ వైరల్ చేస్తున్నారు.
తాజాగా సజ్జనార్ పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్‌ను ఆర్టీసీ బస్సుల ప్రమోషన్ కోసం వాడుకున్నారు. ఈ పిక్ లో ‘చాలా రోజుల తర్వాత కలిశాం, ఏదైనా టూర్ వెళదామా?’ అని ప్రభాస్ అనగా ‘వెళదాం కానీ, ఆర్టీసీ బస్సులోనే వెళదాం’ అని పూజా హెగ్డే అంటుంది. ‘ఎందుకు?’ అని ప్రభాస్ ప్రశ్నించగా ‘ఎందుకంటే ఆర్టీసీ ప్రయాణం సురక్షితం- సుఖమయం’ అని పూజా సమాధానం చెప్తున్నట్లుగా ఉంటుంది. దీనికి ‘బస్సే క్షేమం అంటున్న రాధేశ్యామ్’ అని ఒక టైటిల్ కూడా ఇచ్చేశారు. ప్రస్తుతం ఈ మీమ్ వైరల్‌గా మారింది. రేపు రాధే శ్యామ్ వస్తుండగా దీనిని ట్వీట్ చేయడం తో అభిమానులు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు.
#TSRTC బస్సులోనే వెళ్దాం అంటున్నా #RadheShyam Choose TSRTC & Encourage the #publictransport @TSRTCHQ @TV9Telugu @SakshiHDTV @ntdailyonline @News18Telugu @baraju_SuperHit @telugufilmnagar @Sreeram_singer @puvvada_ajay @Govardhan_MLA @TeluguBulletin @ChaiBisket @boxofficeindia pic.twitter.com/3QuEsYqN9i
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) March 10, 2022