
దాదాపు మూడేళ్లుగా డార్లింగ్ అభిమానులు , సినీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న రాధే శ్యామ్ మరో వారం లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటివరకు విడుదలైన టీజర్, ట్రైలర్స్ , మేకింగ్ , స్టిల్స్ ఇలా ప్రతిదీ సినిమా ఫై అంచనాలు పెంచేయడం తో సినిమాను ఎప్పుడెప్పుడా చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. మొన్నటి వరకు సైలెంట్ గా చిత్ర యూనిట్…ప్రస్తుతం ప్రమోషన్స్ తో స్పీడ్ పెంచారు. ఇప్పటికే ప్రభాస్ , పూజా హగ్దే లు ముంబై లో చక్కర్లు కొడుతూ సినిమాకు బజ్ తీసుకొచ్చే పనిలో ఉన్నారు.
తాజాగా చిత్ర మేకింగ్ వీడియో విడుదల చేసి రోమాలు నిక్కబొడుచుకునేలా చేసారు. ఈ వీడియో చూస్తుంటే.. ‘రాధేశ్యామ్’ కోసం మేకర్స్ ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంది. సినిమాని ఎంత బాగా చిత్రీకరించారో వీడియో చూస్తే తెలిసిపోతుంది. యూరప్‌లోని అందమైన లొకేషన్స్, మంచు ప్రాంతాలతో చాలా కష్టపడి సినిమా షూటింగ్ జరిపారు. అలాగే 1970 కాలం నాటి ఇటలీని కళ్లకు కట్టినట్లుగా చూపించారు. కరోనా కారణంగా యూరప్‌లో షూటింగ్ ఆగిపోవడంతో.. ఇండియాలో యూరప్ సెట్ వేసి మరీ షూటింగ్ చేశారు. ఇటాలీ సెట్, సినిమాకి మ్యూజిక్ అందివ్వడం.. ఇలా అన్ని వీడియోలో చూపించారు. ఈ వీడియో చూస్తుంటే సినిమా ఫై మరింత అంచనాలు పెరిగిపోతున్నాయి. మీరు కూడా ఈ మేకింగ్ వీడియో ఫై లుక్ వెయ్యండి.
