Homeటాప్ స్టోరీస్రాధే శ్యామ్ నుండి మరో సాంగ్ రిలీజ్

రాధే శ్యామ్ నుండి మరో సాంగ్ రిలీజ్

 Radhe shyam Main Ishq MeinHoon song release
Radhe shyam Main Ishq MeinHoon song release

రాధే శ్యామ్ చిత్ర రిలీజ్ కు మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉండడం తో చిత్ర యూనిట్ ప్రమోషన్లను ఇంకాస్త స్పీడ్ చేసారు. ఇప్పటికే సినిమాలోని పలు సాంగ్స్ ను విడుదల చేసి ఆకట్టుకోగా..తాజాగా ఈ సినిమా నుంచి హిందీ వర్షన్‌ సాంగ్‌ ను విడుదల చేసింది మూవీ మేకర్స్.

హిందీ వర్షెన్‌ లో సాగే… ఈ సాంగ్‌ “మెయిన్‌ ఇష్క్ మే హూన్” అనే లిరిక్స్‌ తో ప్రారంభం అవుతుంది. ఈ సాంగ్ లో ప్రభాస్ , పూజా హగ్దే లు చాల రొమాంటిక్ గా కనిపించారు. ఇక దాదాపు మూడేళ్లుగా డార్లింగ్ అభిమానులు , సినీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఫై భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఇప్పటివరకు విడుదలైన టీజర్, ట్రైలర్స్ , మేకింగ్ , స్టిల్స్ ఇలా ప్రతిదీ సినిమా ఫై అంచనాలు పెంచేయడం తో సినిమాను ఎప్పుడెప్పుడా చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. మరో పక్క దుబాయ్ సెన్సార్ మెంబర్ గా చెప్పుకునే సినీ విశ్లేషకులు ఉమైర్ సంధు రాధే శ్యామ్ ఫస్ట్ రివ్యూ అంటూ తన సోషల్ మీడియా లో పేజీ లో రివ్యూ పెట్టేసాడు.

- Advertisement -

సినిమా ఎవరు ఊహించని విధంగా ఉందని , క్లైమాక్స్ గురించి ఎంత చెప్పిన తక్కువే అని , అసలు తెలుగు సినిమా చూస్తున్నామా…హాలీవుడ్ మూవీ చూస్తున్నామా అనే రేంజ్ లో గ్రాఫిక్స్ ఉన్నాయని చెప్పుకొచ్చాడు. ప్రభాస్ క్లాస్ లుక్ లో కుమ్మేసాడని, ఈ సినిమా తో ప్రభాస్ రేంజ్ రెట్టింపు కావడం ఖాయమని తెలిపాడు. వీరి రివ్యూ తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All