Homeటాప్ స్టోరీస్రాధే శ్యామ్ క్లోజింగ్ కలెక్షన్స్

రాధే శ్యామ్ క్లోజింగ్ కలెక్షన్స్

విడుదల విషయంలో మార్పే లేదంటున్న ప్రభాస్
విడుదల విషయంలో మార్పే లేదంటున్న ప్రభాస్

బాహుబలి , సాహో చిత్రాల తర్వాత ప్రభాస్ నుండి వచ్చిన చిత్రం రాధే శ్యామ్. రాధాకృష్ణ డైరెక్ట్ చేయగా యువీ క్రియేషన్స్ వారు నిర్మించారు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. దీంతో చిత్ర బయ్యర్లు భారీగా నష్టపోయారు. ప్రస్తుతం మేకర్స్ వారిని కొంతమేర ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటె ఈ మూవీ క్లోజింగ్ కలెక్షన్లు బయటకు వచ్చాయి.

నైజాంలో రూ. 24.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 7.46 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.90 కోట్లు, ఈస్ట్‌లో రూ. 4.34 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.32 కోట్లు, గుంటూరులో రూ. 4.50 కోట్లు, కృష్ణాలో రూ. 2.71 కోట్లు, నెల్లూరులో రూ. 2.14 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 54.17 కోట్లు షేర్, రూ. 84.58 కోట్లు గ్రాస్ వచ్చింది. కర్నాటకలో రూ. 4.25 కోట్లు, తమిళనాడులో రూ. 78 లక్షలు, కేరళలో రూ. 18 లక్షలు, హిందీలో రూ. 10.68 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.69 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 11.45 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 83.20 కోట్లు షేర్‌తో పాటు రూ. 151.50 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

- Advertisement -

ప్రపంచ వ్యాప్తంగా రూ. 202.80 కోట్లు మేర బిజినెస్ జరగడం తో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 204 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ఫుల్ రన్‌లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 83.20 కోట్లు వసూలు చేసింది. ఈ లెక్కన 120.80 కోట్లు నష్టం వాటిల్లింది. ప్రస్తుతం థియేటర్స్ లో నుండి ఈ మూవీని లేపేశారు. ఏప్రిల్ 01 నుండి అమెజాన్ లో స్ట్రీమింగ్ కాబోతుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All