
చిత్రసీమలో రికార్డ్స్ అనేవి ఎవరికీ శాశ్వతం కాదు..ఒకరి రికార్డ్స్ ను మరో హీరో బ్రేక్ చేయడం కామన్. తాజాగా ప్రభాస్ అదే చేసాడు. నిన్నటి వరకు నైజాం ఏరియా లో రికార్డు గా చెప్పుకునే పవన్ పేరు ను పక్కకు జరిపి ఆయన పేరు నిలబెట్టుకున్నాడు. తాజాగా ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ మూవీ భారీ అంచనాల నడుమ నిన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్ట్ చేయగా , పూజా హగ్దే హీరోయిన్ నటించింది. కృష్ణం రాజు , భాగ్యశ్రీ , సత్యరాజ్ , జగపతి బాబు తదితరులు పలు పాత్రల్లో నటించారు. సినిమా టాక్ విషయం పక్కన పెడితే…ఫస్ట్ డే పలు రికార్డ్స్ బ్రేక్ చేసాడు ప్రభాస్.
ముఖ్యంగా నైజాం ఏరియా లో నిన్నటి వరకు భీమ్లా నాయక్ పేరిట ఉన్న రికార్డు ..ఇప్పుడు రాధే శ్యామ్ బ్రేక్ చేసింది. నైజాంలో తొలి రోజు 11.87 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు సమాచారం. ఇటీవల రిలీజైన భీమ్లా నాయక్ 11.8 కోట్లు, పుష్ప 11.4 కోట్లు వసూలు చేయడం గమనార్హం. అలాగే ఒక్క హైదరాబాద్ సిటీ లోనే కేవలం అడ్వాన్స్ ద్వారానే 6.5 కోట్లు వసూలు చేసి ప్రభాస్ చరిత్ర సృష్టించాడు.