Homeటాప్ స్టోరీస్రోజు రోజుకు రాధే శ్యామ్ కలెక్షన్లు దారుణంగా పడిపోతున్నాయి..

రోజు రోజుకు రాధే శ్యామ్ కలెక్షన్లు దారుణంగా పడిపోతున్నాయి..

విక్రమాదిత్య ఎవరో 23న చెబుతారట!!
విక్రమాదిత్య ఎవరో 23న చెబుతారట!!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్‌ రూపొందించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘రాధే శ్యామ్’. కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద నిర్మించగా , పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. మార్చి 11 న ఈ మూవీని ఐదు భాషల్లో భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ ఆ అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోవడం తో రోజు రోజుకు కలెక్షన్లు దారుణంగా పడిపోతున్నాయి. మొదటి రెండు రోజులుగా భారీగానే వసూళ్లు రాబట్టగా..మూడో రోజు నుండి కలెక్షన్లు తగ్గడం మొదలయ్యాయి.

ఇక తెలుగు రాష్ట్రాల్లో 5 వ రోజు కలెక్షన్లు చూస్తే..

- Advertisement -

నైజాంలో రూ. 53 లక్షలు
సీడెడ్‌లో రూ. 15 లక్షలు
ఉత్తరాంధ్రలో రూ. 10 లక్షలు
ఈస్ట్‌లో రూ. 9 లక్షలు
వెస్ట్‌లో రూ. 6 లక్షలు
గుంటూరులో రూ. 8 లక్షలు
కృష్ణాలో రూ. 8 లక్షలు
నెల్లూరులో రూ. 5 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 1.14 కోట్లు షేర్, రూ. 1.85 కోట్లు గ్రాస్ సాధించింది. మొత్తం ఐదు రోజుల్లో రెండు రాష్ట్రాల్లో రూ. 51.64 కోట్లు షేర్, రూ. 80.45 కోట్లు గ్రాస్ రాబట్టగా, ప్రపంచ వ్యాప్తంగా రూ. 77.20 కోట్లు షేర్‌తో పాటు రూ. 138 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. ఈ లెక్కన చూస్తే మరో 126.80 కోట్లు వస్తే కానీ ఇది హిట్ అని అనిపించుకోదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All