Homeటాప్ స్టోరీస్మ‌ళ్లీ న‌య‌న‌తార‌ని టార్గెట్ చేశాడు!

మ‌ళ్లీ న‌య‌న‌తార‌ని టార్గెట్ చేశాడు!

మ‌ళ్లీ న‌య‌న‌తార‌ని టార్గెట్ చేశాడు!
మ‌ళ్లీ న‌య‌న‌తార‌ని టార్గెట్ చేశాడు!

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌ని మ‌ళ్లీ టార్గెట్ చేశాడు త‌మిళ న‌టుడు రాధార‌వి. డీఎంకే పార్టీ నుంచి న‌య‌న‌తార వ‌ల్ల బ‌య‌టికి వ‌చ్చిన ఆయ‌న ప్ర‌స్తుతం బీజేపీలో కొన‌సాగుతున్నారు. న‌టుడిగా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ యూనియ‌న్ ప్రెసిడెంట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న రాధార‌వి గ‌త కొంత కాలంగా ప‌లు వివాదాల్లో నిలుస్తూ త‌ర‌చూ వార్త‌ల్లో వుంటున్నారు. గ‌తంలో న‌య‌న‌తారపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి ప‌లువురి విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు.

దీంతో డీఎంకే పార్టీ అత‌న్ని పార్టీ నుంచి వైదొల‌గాల‌ని హుకుజారీ చేసింది. దీంతో ఆ పార్టీ నుంచి బ‌య‌టికి వ‌చ్చిన ఆయ‌న బీజేపీలో చేరి తాజాగా మ‌రోసారి న‌య‌న‌తార‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పార్టీ ప్ర‌చార వేదిక‌పై మాట్లాడుతూ డీఎంకే పార్టీకి న‌య‌న‌తార ఏమౌతుంది? ఆమె ఏమైనా ఆ పార్టీకి పీఆర్వోనా? . గ‌తంలో ఓ స‌భ‌లో ఆమె గురించి మాట్లాడినందుకు ఆ పార్టీ నుంచి న‌న్ను తొల‌గించాల‌ని కొంత మంది పెద్ద‌లు చూశారు. వారు పంపాల‌నుకున్న ఆదేశాలు నా వ‌ర‌కు రాకుండానే ఆ పార్టీకి నేను రాజీనామా చేశా` అన్నారు.

- Advertisement -

అంత‌టితో ఆగని రాధార‌వి `ఆమె క‌నుక ఉద‌య‌నిధి స్టాలిన్‌తో రిలేష‌న్‌లో వుంటే నేను మాత్రం ఏం చేస్తాను` అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. రాధార‌వి వ్యాఖ్య‌ల‌పై న‌య‌న‌తార చ‌ర్య‌లు తీసుకుంటుందా?  లేక ఉద‌య‌నిధి స్టాలిన్ చ‌ర్య‌లు తీసుకుంటాడా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All