Homeటాప్ స్టోరీస్రాధే శ్యామ్ లో ఆ ఒక్క సీన్ కోసం డైరెక్టర్ చాల కష్టపడ్డాడట..

రాధే శ్యామ్ లో ఆ ఒక్క సీన్ కోసం డైరెక్టర్ చాల కష్టపడ్డాడట..

Radha Krishna Kumar about radhe shyam climax
Radha Krishna Kumar about radhe shyam climax

ప్రభాస్ – పూజా హగ్దే జంటగా రాధాకృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన రాధే శ్యామ్ మూవీ మార్చి 11 న రిలీజ్ కాబోతుంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్య క్రమాలను స్పీడ్ చేసింది. వరుస ఇంటర్వూస్ ఇస్తూ సినిమా తాలూకా అనేక విశేషాలు తెలుపుతూ సినిమా ఫై ఆసక్తి పెంచుతున్నారు. తాజాగా డైరెక్టర్ రాధాకృష్ణ సినిమాలో క్లైమాక్స్ కోసం ఎంతో కష్టపడినట్లు తెలిపాడు.

ఇప్పటివరకు విడుదలైన ట్రయిలర్స్, టీజర్, పోస్టర్లలో చూస్తున్న షిప్ ఎపిసోడ్ క్లైమాక్స్ లోనే వస్తుందట. ఆ ఎపిసోడ్ షూట్ చేయడం కోసం చాలా కష్టపడ్డామని తెలిపాడు దర్శకుడు. సినిమా మొత్తం ఒక ఎత్తయితే, ఆ ఒక్క పార్ట్ మరో ఎత్తు అని చెప్పుకొచ్చారు. రాధేశ్యామ్ సినిమా మొత్తానికి ఏడాదిన్నర పాటు ప్రీ-ప్రొడక్షన్ వర్క్ నడిస్తే, కేవలం క్లైమాక్స్ పార్ట్ కోసమే దాదాపు 5 నెలలు ప్రీ ప్రొడక్షన్ చేయాల్సి వచ్చిందని తెలిపాడు. సినిమా మొత్తం మీద తనకు ఇష్టమైన ఎపిసోడ్ క్లైమాక్స్ మాత్రమేనని అని క్లైమాక్స్ ఫై అభిమానుల్లో , సినీ లవర్స్ లో అంచనాలు పెంచారు. మరి ఆ ఎపిసోడ్ ఎలా ఉంటుందో తెలియాలంటే మార్చి 11 వరకు ఆగాల్సిందే .
కృష్ణంరాజు సమర్పణలో గోపీ కృష్ణ మూవీస్ తో కలిసి యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో కృష్ణంరాజు, భాగ్యశ్రీ, మురళీ శర్మ , సచిన్ ఖేడ్కర్ , జయరామ్ , ప్రియదర్శి , సత్యరాజ్ , కునాల్ రాయ్ కపూర్ , ఎయిర్ టెల్ శాషా ఛత్రి, రిద్ది కుమార్ ,సత్యన్ మొదలగువారు కీలక పాత్రలు పోషించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All