HomeAudio Reviews'పూజ' పాప ఎందుకమ్మ మా హీరోని అంతగనం ఆగం చేసావు?

‘పూజ’ పాప ఎందుకమ్మ మా హీరోని అంతగనం ఆగం చేసావు?

'పూజ' పాప ఎందుకమ్మ మా హీరోని అంతగనం ఆగం చేసావు?
‘పూజ’ పాప ఎందుకమ్మ మా హీరోని అంతగనం ఆగం చేసావు?

మొన్ననేమో ‘అలా వైకుంఠపురములో’ సినిమా నుండి రెండవ పాట ‘రాములో రాములా’ అంటూ సాగే వీడియో సాంగ్ బిట్ ని ఈ నెల 21 వ తేది సాయంత్రం 04:05 గంటలకి విడుదల చేస్తారు అని చెప్పారు. 21 సాయంత్రం 04:05 అయింది ఇంకా రిలీజ్ చేయలేదు. సరే కొంచెం అటు ఇటుగా విడుదల చేస్తారు అని చెప్పి అల్లు అర్జున్ ఫాన్స్ అదే పనిగా యూట్యూబ్ లో మొకం పెట్టి చూస్తూ ఉన్నారు. కొంతమంది ట్విట్టర్ లో విడుదల చేస్తారు అని చూసారు, అయినా రాలేదు.

కొంత సమయం తర్వాత నిర్మాతలు అయిన ‘హారిక హాసినీ క్రియేషన్స్’ వారు ట్విట్టర్ లో ఫ్యాన్స్ ని క్షమించమని చెప్పి ఇంకొక పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఆ పోస్టర్ లో 22 సాయంత్రం అదే సమయం అనగా 04:05 విడుదల చేస్తున్నాము అని చెప్పారు. అప్పటికి కొంతమంది నిర్మాతలని తిట్టుకోగా..ఇంక ఏమి చేస్తాం? ఇంకొక రోజే కదా వెయిట్ చేస్తాం. అని అనుకోని ఓపికగా ఈ రోజు సాయంత్రం వరకు చూస్తూ కూర్చున్నారు.మొదటి సారి మాట తప్పిన వారు ఈ రోజు సరిగ్గా అనుకున్న సమయానికి విడుదల చేసారు. ‘రాములో రాములా నన్నాగం జేసిందిరో…. రాములో రాములా నా పానం తీసిందిరో’ అంటూ సాగే ఒక చిన్నపాటి వీడియో సాంగ్ ని విడుదల చేసారు.

- Advertisement -

26 సెకన్లు ఉన్న ఆ వీడియో లో ‘అలా వైకుంఠపురములో’ చిత్ర బృందం సగానికి సగం కనిపించింది. అల్లు అర్జున్, పూజ హెగ్డే లతో కలిసి సుశాంత్, జయరాం (‘భాగమతి’ సినిమా ఫేమ్), మురళి శర్మ వారు కూడా స్టెప్పులు వేస్తున్నారు. మొత్తం పాటని దీపావళి పండగ సందర్భంగా 26 తేదీన విడుదల చేయబోతున్నాము అని వీడియో చివరలో ఇచ్చారు. ‘కాసర్ల శ్యామ్’ సాహిత్యం అందించగా ‘అనురాగ్ కులకర్ణి’ పాటను పాడారు. లేడీ సింగర్ ‘మంగ్లీ’ కూడా పాటని పాడటం జరిగింది కానీ ఆమె గొంతు మొత్తం పాట విడుదల చేసినప్పుడు వింటాము. ఈ రోజు విడుదల చేసిన దాంట్లో ఆమె గొంతు వినపడలేదు. థమన్.ఎస్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. రేసుగుర్రం, సరైనోడు సినిమాల తర్వాత అల్లు అర్జున్- థమన్ మరొక సారి ఈ సినిమాకి కలిశారు. మొదటి ‘సామజవరగమనా’ పాట ఆల్రెడీ యూట్యూబ్ లో సంచలం సృష్టించింది.

గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్లపై  అల్లు అరవింద్ – ఎస్.రాధాకృష్ణ (చిన్నబాబు) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మాటల మాంత్రికుడు ‘త్రివిక్రమ్ శ్రీనివాస్’ దర్శకులు. తారాగణం విషయానికి వస్తే అల్లుఅర్జున్ , పూజ హెగ్డే, టబు, నివేత పేతురాజ్, రాజేంద్ర ప్రసాద్, జయరాం, సుశాంత్, వెన్నెల కిషోర్, సునీల్, నవదీప్, బ్రహ్మాజీ, మురళి శర్మ, రాహుల్ రామకృష్ణ, హర్ష వర్ధన్, సచిన్ ఖేడేకర్ లాంటి పెద్ద నటి నటులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాకి ఫైట్ మాస్టర్స్ ‘రామ్ లక్ష్మణ్’.మొత్తానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా సంక్రాంతికి కోడి పందెం ఆటలాగా మహేష్ బాబు – అనిల్ రావిపూడి గారి సినిమాకి పోటీగా సిద్ధం చేస్తున్నారు అలా వైకుంఠపురములో సినిమాని. చూసుకుంటే మరి ఈ పోటీలో ఎవరు గెలుస్తారో? లేక ఇద్దరికి విజయం దక్కుతుందో? అనేది తెలియాలి అంటే వచ్చే సంక్రాంతి జనవరి 11,12 తేదీల దాకా ఆగి చూడాల్సిందే తప్ప ఇప్పటినుండే మనం ఏమి చేయలేము…

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All