Homeటాప్ స్టోరీస్కథలు ఒకరి నుండి ఇంకొకరికి వెళుతున్నాయి కానీ ఫలితం మాత్రం రాట్లేదు.. 

కథలు ఒకరి నుండి ఇంకొకరికి వెళుతున్నాయి కానీ ఫలితం మాత్రం రాట్లేదు.. 

Raaju Gaari Gadhi 3 Movie Release 18 October
కథలు ఒకరి నుండి ఇంకొకరికి వెళుతున్నాయి కానీ ఫలితం మాత్రం రాట్లేదు..

ఈ  సంవత్సరం అని మాత్రమే కాదు గత  కొన్ని సంవత్సరాలుగా కొన్ని కథలు  కొంతమందికి మాత్రమే సరిగ్గా సరిపోతాయి అని తెలిసిపోతుంది. బాగాలేని కథ కూడా హీరో అదృష్టం బాగుంటే సినిమా హిట్ అవ్వచ్చు.ఒక హీరో దగ్గర కథ నచ్చి  డేట్స్ కుదరకపోతే ఇంకొక హీరో దగ్గరికి పోయేసరికి ఆ కథ అడ్డం తిరిగి సినిమా బోల్తా కొట్టొచ్చు. హీరోలకి మాత్రమే ఇలా  జరుగుతుందా? కథా నాయికలకు ఇలానే జరుగుతుందా అంటే  మాకు అలానే జరుగుతున్నాయి అంటున్నారు కొంతమంది కథా నాయికలు.

ఉదాహరణకు ‘రాజు గారి గది3‘ సినిమా విషయం దగ్గరికి వస్తే మొదట ఇందులో కథానాయికగా మిల్కీ బ్యూటీ ‘తమన్నా‘ అని చెప్పి పూజ కార్యక్రమాలు కూడా  జరిపించేసారు. అలా జరిగి 2 రోజులు అయ్యిందో లేదో వెంటనే తమన్నా సినిమా నుండి తప్పుకోవడం ఆ ప్లేస్ లోకి ఇంకొక కథా నాయిక రావడం జరిగింది. ఈ విషయం గురించి అడిగిన వారు లేరు. ఆలోచించే పరిస్థితి లో కూడా  ఎవ్వరు ఉండలేకపోవడం జరిగింది. మొత్తానికి  సినిమా విడుదల ముందు ఒక్కొక్కటిగా బయటికి  రావడం సినిమా ప్రమోషన్స్ లో భాగం అవ్వడం  సర్వసాధారణం కదా. సినిమాకి దర్శకులు ‘ఓంకార్’ గారు.
హీరో అశ్విన్ బాబు ని ఈ విషయం గురించి అడగగా ‘తమన్నా మా సినిమా నుండి తప్పుకోలేదు, అలా అని మేము తీసెయ్యలేదు. కేవలం తమన్నా డేట్స్ కాలి లేక తమన్నా  ప్లేస్ లోకి ‘అవికా గోర్’ వచ్చి చేరింది. సినిమాలో అవికా గోర్ పాత్ర బాగా  వచ్చింది. రేపు మీరు సినిమా చూసేటప్పుడు కూడా మీకు తెలుస్తుంది అని అన్నారు. నిజానికి ట్రైలర్ చూస్తే అవికా దెయ్యం లాగా అందవికారంగా కనపడుతుంది. అదే ప్లేస్ లో మనం తమన్నా ని ఊహించుకుంటే  అందవికారంగా ఉన్న  తమన్నా ని చూడలేమేమో. తమన్నా తప్పుకొని మంచి పని చేసిందో లేదా ఒక మంచి పాత్ర ని చేజారించుకుందో తెలియాలి అంటే సినిమాలో అవికా గోర్ పాత్ర చూసేదాకా  ఏమీ చెప్పలేము.
ఈ సంవత్సరం రిలీజ్ అయిన ‘శర్వానంద్’ “రణరంగం” సినిమా కూడా శర్వానంద్ గారికోసం రాసుకున్న కథ కాదు. దర్శకుడు సుధీర్ వర్మ ఆ కథని ‘మాస్ మహారాజ్ రవితేజ’ కోసం రాసుకున్నారు. ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ శర్వానంద్ దగ్గరికి వెళ్లిన ఆ కథ మరియు ఆ సినిమా ఘోర పరాజయం అయ్యింది. ఒకవేళ ఆ సినిమా రవితేజ గారు చేసివుంటే సినిమా హిట్ అయితే క్రెడిట్ రవితేజ గారికి దక్కేది. ఫ్లాప్  అయితే  రవితేజ కెరీర్ లో ఘోర పరాజయం అయ్యేది.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All