అందాల రాశి గెహనా వశిష్ఠ్ “రాహ్ కా తేరి ముసాఫిర్ హూన్” అంటూ తన నృత్యాలతో అలరించబోతున్నారు. ఆమె నర్తించిన ఈ పాట అతి త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. నిజమైన అందానికి అర్ధం చెప్పే ఈ పాటను కాశ్మీర్, గుల్మార్గ్‌లో చిత్రీకరించారు. ఈ పాటలో.. కళ్లుచెదిరే అందాలతో పాటు అమాయకత్వంతో కనిపించే గెహనా అందంగా ఉందో.. లేక కాశ్మీర్ అందంగా ఉందో చెప్పడం చాలా కష్టం. ఆసిఫ్ పంజ్వాని స్వరపరచిన ఈ పాటను అహ్మద్ షాద్ సఫ్వి పాడారు.
ఈ పాటలో కాశ్మీర్ అందాలతో పాటు.. గెహనా వశిష్ఠ్ అందాన్ని కూడా తన కెమెరాలో చక్కగా బంధించారు నితీష్ చంద్ర. రెడ్ వుడ్ ప్రొడక్షన్ సంస్థ నిర్మించిన ఈ పాటను జీ మ్యూజిక్ ద్వారా విడుదల చేయనున్నారు. ఈ పాటలో గెహనాతో పాటు సల్మాన్ భట్ కూడా కనిపిస్తారు. దీనికి షదబ్ సిధ్ధికి దర్శకత్వం వహించారు. ప్రేక్షకులను మంత్రముగ్థులను చేసే గెహనా అందంతో పాటు.. స్లో మోషన్ షాట్స్.. కనువిందైన రొమాన్స్ ఈ గీతానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయని నిర్మాణ సంస్థ చెప్పుకొస్తోంది. కాగా, ఈ నెల 26న ఈ పాటను జీ మ్యూజిక్ కంపెనీ ద్వారా యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేయనున్నారు.