Homeటాప్ స్టోరీస్సెన్సార్ పైన ఫైర్ అయిన విప్లవ నటుడు

సెన్సార్ పైన ఫైర్ అయిన విప్లవ నటుడు

r.narayanamurthy fire on censor boardవిప్లవ నటుడు ఆర్ . నారాయణమూర్తి సెన్సార్ బృందం పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు . తాజాగా ఆర్ . నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ” అన్నదాత సుఖీభవ ” . షూటింగ్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది , అయితే సెన్సార్ సభ్యులు మూడు సీన్లు కట్ చేయమని కోరడంతో ఆర్ . నారాయణమూర్తి రెండు సీన్ల గురించి రాజీ పడటానికి సిద్దమయ్యాడు కానీ మూడో సీన్ కు మాత్రం ఒప్పుకోలేదు కానీ సెన్సార్ వాళ్ళు మాత్రం అడ్డగోలు విధానాలతో విప్లవ నటుడి ని విసిగించడంతో రివైజింగ్ కమిటీ కి వెళ్లాలని నిర్ణయించుకున్నాడట . అదే విషయాన్నీ మీడియా ముందుకు వచ్చి సెన్సార్ వాళ్లపై ఫైర్ అయ్యాడు .

ఇంతకీ సెన్సార్ వాళ్ళు చెప్పిన కట్స్ ఏంటో తెలుసా …….. జి ఎస్ టి టాక్స్ గురించి విమర్శ చేయొద్దని , అలాగే పెద్ద నోట్ల రద్దు దాని వల్ల సామాన్య జనం ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కూడా విమర్శ చేయొద్దని చెప్పారట అయితే ఈ రెండింటికి ఒప్పుకున్నాడు ఇక ఒప్పుకోకుండా ఎదురు తిరిగిన సీన్ ఏంటంటే …… రైతు లు ఋణం తీసుకొని సకాలంలో కట్టకపోతే చిన్న మొత్తానికే ఇల్లు జప్తు చేస్తామని బ్యాంక్ అధికారులు గగ్గోలు పెడుతారు కానీ పారిశ్రామిక వేత్తలు వేల కోట్లు అప్పుగా తీసుకొని వాటిని సకాలంలో చెల్లించరు సరికదా ! ఇతర దేశాలకు పారిపోయినా వాళ్ళను పట్టించుకున్న పాపాన పోలేదనే డైలాగ్ ని తొలగించమని సెన్సార్ సభ్యులు కోరారట . అక్కడ ఎదురు తిరిగిన ఆర్ . నారాయణమూర్తి రివైజింగ్ కమిటీ కి వెళుతున్నాడు . మరి అక్కడ ఏమౌతుందో ! ఎంతైనా ఆర్ . నారాయణమూర్తి వాదనలో నిజముంది కదా !

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All