
కరోనా వైరస్ కారణంగా యావత్ ప్రపంచం అల్లాడుతోంది. ఎక్కడ చూసినా.. ఏ దేశం గురించి విన్నా కరోనా మరణాలే.. కరోనా కారణంగా జన జీవితం స్థంభించిపోయింది. ఎక్కడి వారు అక్కడే అన్నట్ఉగా జీవితాల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ఒక్కసారిగా ఉపద్రవం వచ్చిపడటంతో సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఏం జరుగుతోంది? ఏంటీ పరిస్థితి అనే షాక్‌లోనే వున్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమ కరోనా కారణంగా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది.
సోషల్ డిస్టెన్స్‌ని పాటిస్తూ షూటింగ్‌లు చేయడం అన్నది సాధ్యం అయ్యే పని కాదు. అలా చేయడం కుదరదు కూడా. దీన్ని దృష్టిలో పెట్టుకుని బుల్లితెర, వెండితెర షూటింగ్‌లకు శరతులతో కూడిన అనుమతలు ఇవ్వాలని ఫెఫ్సీ అధ్యక్షుడు, దర్శకుడు ఆర్.కె. సెల్వమణి తమిళనాడు ప్రభుత్వాన్ని కోరడం ఆసక్తికరంగా మారింది. షరతులతో కూడిన అనుమతలు ఇవ్వాలని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిని ఆర్.కెజ సెల్వమణి కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ `లాక్‌డౌన్ ప్రారంభం కావడంతో సినీ పరిశ్రమలో షూటింగ్‌లు నిలిచిపోయి దాదాపు 50 రోజులు అవుతోందని, ఒకప్పుడు 100 రోజులు, సిల్వర్ జూబ్లీలు, డైమండ్ జూబ్లీ కార్యక్రమాలతో కళకళలాడిన చిత్ర పరిశ్రమ ఇప్పుడు లాక్‌డౌన్‌తో 50 రోజులు అని చెప్పుకోవాల్సిన పరిస్థితికి చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కనుక శరతులతో కూడిన అనుమతులిస్తే డబ్బింగ్, రి రికార్డింగ్ నిర్మాణానంతర పనులకు కార్మిక సమాఖ్యలోని 40, 50 శాతం మంది కార్మికులకు పని లభిస్తుందని ఆయన వెల్లడించారు.