
వెండితెరపై తగ్గిదేలే అనిపించుకున్న పుష్పరాజ్..బుల్లితెరపై కూడా అదే అనిపించాడు. వెండితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ మూవీ బుల్లితెర ప్రేక్షకులను సైతం అలరించింది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా ఛానెల్ లో టెలికాస్ట్ అయిన పుష్ప సినిమాకు రికార్డ్ స్థాయిలో 22.5 రేటింగ్ వచ్చింది.
ఇంతకుముందు బన్నీ నటించిన అల వైకుంఠపురములో సినిమాకు ఏకంగా 29.4 టీఆర్పీ వచ్చింది. టాప్ వన్ లో ఆలా వైకుంఠపురం లో ఉండగా రెండో స్థానంలో మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు 23.4 , పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ 19.2 మూడో స్థానంలో , ఉప్పెన 18 తో నాల్గో స్థానంలో, క్రాక్ 11.66 టీఆర్పీ తో ఐదో స్థానంలో ఉన్నాయి. అలా టాప్-5 రేటింగ్స్ లో బన్నీ నటించిన 2 సినిమాలు ఉండడం విశేషం.
- Advertisement -