
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం పుష్ప. ఈ సినిమాను మొదట ఆగస్ట్ లో విడుదల చేద్దామనుకున్నారు కానీ ఇప్పుడది జరగదు. ఎందుకంటే కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ రెండు నెలలకు పైగా సాగలేదు. ఇక ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే మొదలైంది. 45 రోజుల భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేసారు.
అయితే రీసెంట్ గా హైదరాబాద్ లో కురిసిన వర్షాల కారణంగా ఈ షెడ్యూల్ అప్సెట్ అయింది. ఇప్పుడు అక్టోబర్ వరకూ షూటింగ్ ను చేయబోతున్నారు. అక్టోబర్ తో షూటింగ్ పూర్తయినా కానీ పుష్ప ఈ ఏడాది విడుదల కాబోవట్లేదు. 2022లో పుష్ప చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్ చేసారు.
సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ప్యాన్ ఇండియా లెవెల్లో మొత్తం ఐదు భాషల్లో విడుదల కానుంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తోంది.