
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న పుష్ప ఇప్పుడు సమయంతో పోరాడుతోంది. పుష్ప ది రైజ్ ఇంకా షూటింగ్ పూర్తిచేసుకోవాల్సి ఉంది. నవంబర్ 28 నుండి ఐటెం సాంగ్ ను షూట్ చేస్తారు. మరోవైపు అన్ని భాషల్లో డబ్బింగ్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. దర్శకుడు సుకుమార్ పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాలను పర్యవేక్షిస్తూ పనులు వేగవంతంగా జరిగేలా చూస్తున్నాడు.
ఇక పుష్ప ట్రైలర్ లాంచ్ ను అట్టహాసంగా నిర్వహించాలని మరోవైపు ప్రణాళికలు వేస్తున్నారు. పుష్ప ది రైజ్ ట్రైలర్ ను డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ట్రైలర్ ను దుబాయ్ లో ఒక భారీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ద్వారా విడుదల చేస్తారు. ప్రమోషన్స్ విషయంలో పుష్ప అగ్రసివ్ గానే ఉంది. మరి సమయానికి పుష్ప పనులు అన్నీ పూర్తవుతాయా అన్నది చూడాల్సి ఉంది.
రష్మిక మందన్న ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెల్సిందే. అలాగే స్పెషల్ సాంగ్ లో సమంత నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. మలయాళ సూపర్ స్టార్ ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో సునీల్, అనసూయలు ప్రముఖ పాత్రల్లో కనిపిస్తారు.