
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం పుష్ప. ఈ సినిమాపై ప్రస్తుతం చాలా మంచి బజ్ ఉంది. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు పాటలు అన్ని భాషల్లో కూడా మంచి రెస్పాన్స్ ను తెచ్చుకున్నాయి. పుష్ప తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. మొదట హిందీ రిలీజ్ విషయంలో కొంత ఇబ్బంది ఎదురైనా కానీ ఇప్పుడు అన్నీ సెట్ అయ్యాయి. డిసెంబర్ 17న పుష్ప భారీ లెవెల్లో విడుదల కానుంది.
తాజా సమాచారం ప్రకారం పుష్ప ది రైజ్ తమిళ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయి. ఫ్యాన్సీ ధరకు టాప్ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ పుష్ప ది రైజ్ థియేట్రికల్ రైట్స్ ను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ చిత్ర హిందీ థియేట్రికల్ రైట్స్ ను గోల్డ్ మైన్స్ కంపెనీ సొంతం చేసుకుంది. అలాగే కన్నడ థియేట్రికల్ రైట్స్ ను సుప్రభాత్ ఫిలిమ్స్ దక్కించుకుంది. మలయాళ వెర్షన్ హక్కులను E4 ఎంటర్టైన్మెంట్స్ సంస్థ కొనుగోలు చేసింది.
సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఇంకా ఒక ఐటమ్ సాంగ్ ను చిత్రీకరించాల్సి ఉంది. సమంత ఆ ఐటమ్ సాంగ్ లో నటించడానికి ఎస్ చెప్పిన విషయం తెల్సిందే. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.
ఇవి కూడా చదవండి:
పుష్ప: సమంత రెమ్యునరేషన్ వింటే మతి పోవాల్సిందే
పుష్ప నాలుగో సింగిల్ అప్డేట్ కూడా వచ్చేసింది
ప్రేక్షకులు “పుష్పక విమానం” చిత్రాన్ని ఫ్లైయింగ్ హిట్ చేశారు
#PushpaTheRise keeps getting huge with time ?
Grand release in Tamil Nadu by the prestigious @LycaProductions ??#PushpaTheRiseOnDec17@alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @adityamusic @MythriOfficial pic.twitter.com/eOmXYcwb4Y— Pushpa (@PushpaMovie) November 17, 2021