Homeన్యూస్1000 మంది డ్యాన్సర్లతో పుష్ప భారీ సాంగ్ షూట్

1000 మంది డ్యాన్సర్లతో పుష్ప భారీ సాంగ్ షూట్

1000 మంది డ్యాన్సర్లతో పుష్ప భారీ సాంగ్ షూట్
1000 మంది డ్యాన్సర్లతో పుష్ప భారీ సాంగ్ షూట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం పుష్ప ది రైజ్ షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఈ చిత్ర షూటింగ్ త్వరలో పూర్తి కానుంది. అయితే ప్రస్తుతం సాంగ్ షూట్ జరుగుతోంది. దాదాపు 1000 మంది డ్యాన్సర్లతో సాంగ్ ను షూట్ చేస్తున్నారు. ఈ స్పెషల్ సాంగ్ చిత్రంలో మెయిన్ అట్రాక్షన్స్ లో ఒకటి కానుంది.

పుష్ప ది రైజ్ షూటింగ్ ను నవంబర్ థర్డ్ వీక్ కు పూర్తి చేయాలని భావిస్తున్నారు. డిసెంబర్ 17న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. దానికి తగ్గట్లుగానే సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సాంగ్ షూటింగ్ పూర్తయ్యాక ప్యాచ్ వర్క్ సన్నివేశాలతో చిత్ర షూటింగ్ ను పూర్తి చేయనున్నాడు దర్శకుడు సుకుమార్.

- Advertisement -

మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు. బన్నీ పూర్తి ఇమేజ్ మేకోవర్ కు వెళ్లిన ఈ చిత్రం మొత్తం ఐదు భాషల్లో విడుదల కానుంది. దానికి సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా మరోవైపు జరుగుతున్నాయి. రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు కాగా ఇప్పటికే విడుదలైన మూడు పాటలు మంచి రెస్పాన్స్ ను తెచ్చుకున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All