
ప్రస్తుతం చిత్రీకరణ దశల్లో ఉన్న చిత్రాల్లో భారీ బజ్ ఉన్న సినిమాగా పుష్ప గురించి చెప్పుకోవచ్చు. ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో మొత్తం ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. పుష్పను మొత్తం రెండు భాగాల్లో విడుదల చేయనున్నారు. మొదటి భాగం పుష్ప ది రైజ్ ను డిసెంబర్ 17న విడుదల చేయనున్నారు.
అయితే కొన్ని మీడియా వర్గాల్లో పుష్ప షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉందని, పెర్ఫెక్షన్ మాస్టర్ గా పేరు తెచ్చుకున్న సుకుమార్ పుష్ప విషయంలో కూడా రీషూట్స్ కు వెళుతున్నాడని చెప్పుకొచ్చారు. అయితే ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని తెలుస్తోంది. పుష్ప ది రైజ్ టాకీ పార్ట్ షూటింగ్ దాదాపుగా పూర్తయ్యిందిట. ఇంకా మూడు పాటలను మాత్రమే చిత్రీకరించాలని తెలుస్తోంది. త్వరలోనే ఈ మూడు పాటల షూటింగ్ ను మొదలుపెట్టి నవంబర్ మిడ్ వీక్ కు షూటింగ్ ను మొత్తాన్ని అవగొట్టాలని సుకుమార్ భావిస్తున్నాడు.
సో, పుష్ప డిసెంబర్ 17 విడుదలకు సరైన ట్రాక్ మీద ఉన్నట్లే. రష్మిక మందన్న ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న పుష్పకు దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి సాంగ్స్ మంచి రెస్పాన్స్ ను తెచ్చుకున్నాయి.