Homeటాప్ స్టోరీస్పుష్ప పార్ట్ 1 థీమ్ ఇదే!

పుష్ప పార్ట్ 1 థీమ్ ఇదే!

పుష్ప పార్ట్ 1 థీమ్ ఇదే!
పుష్ప పార్ట్ 1 థీమ్ ఇదే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఈ సినిమా మొదటి భాగానికి పుష్ప ది రైజ్ టైటిల్ ను ఫిక్స్ చేసారు. టైటిల్ కు తగ్గట్లుగా ఈ సినిమాలో పుష్ప రాజ్ గా చేస్తోన్న అల్లు అర్జున్ చిత్రంలో ఎలా ఎదిగాడు అన్నది చూపిస్తారు.

ఎర్ర చందనం బ్యాక్ డ్రాప్ లో పుష్ప తెరకెక్కుతుందన్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ ఎర్ర చందనం రవాణా చేసే లారీ డ్రైవర్ గా కనిపిస్తాడట. ఇక లారీ డ్రైవర్ నుండి ఎర్ర చందనం బిజినెస్ ను కంట్రోల్ చేసే డాన్ గా పుష్ప రాజ్ ప్రయాణం, అందులో తనకు ఎదురైన సవాళ్ల నేపథ్యంలో పుష్ప ది రైజ్ ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఒకరిద్దరు విలన్స్ ఉంటారు. మెయిన్ విలన్ అయిన ఫహద్ ఫాజిల్ పాత్రలో మొదటి భాగంలో కంటే రెండో భాగంలోనే ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది.

- Advertisement -

రష్మిక మందన్న ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా క్రిస్మస్ కు విడుదలవుతుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All