Homeటాప్ స్టోరీస్బ‌న్నీ మాస్ లుక్ వెన‌క స్టోరీ ఇదా?

బ‌న్నీ మాస్ లుక్ వెన‌క స్టోరీ ఇదా?

బ‌న్నీ మాస్ లుక్ వెన‌క స్టోరీ ఇదా?
బ‌న్నీ మాస్ లుక్ వెన‌క స్టోరీ ఇదా?

ఈ సంక్రాంతికి `అల వైకుంఠ‌పుర‌ములో ` ఇండ‌స్ట్రీ హిట్‌ని  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్  సొంతం చేసుకున్నారు. ఈ హిట్‌తో రెట్టించిన ఉత్సాహంతో వున్న బ‌న్నీ తాజాగా న‌టిస్తున్న తాజా చిత్రం `పుష్ప‌`. సుకుమార్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, క‌న్నడ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల కానుంది. మైత్రీ మూవీమేక‌ర్స్‌, ముత్యంశెట్టి మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

శేషాచ‌లం అడ‌వుల్లో గంధ‌పు చ‌క్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని స‌హ‌జ‌త్వానికి ద‌గ్గ‌ర‌గా `రంగ‌స్థ‌లం` ఫార్మాట్‌లో తెర‌పైకి తీసుకురాబోతున్నారు. ర‌ష్మి‌క మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ లారీ డ్రైవ‌ర్‌గా ర‌గ్గ్‌డ్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఇటీవ‌ల బ‌న్నీకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ని రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే.

- Advertisement -

బ‌న్నీ మాసీవ్ లుక్ కోసం కాస్ట్యూమ్స్‌ని కాఫీలో రెండు రోజులు నాన‌బెట్టి మ‌రీ ఆ త‌రువాత క్లీన్ చేసి వాడుతున్నారట‌. దీంతో కాస్ట్యూమ్స్‌కి ఓల్డ్ లుక్ వ‌చ్చేస్తోంద‌ట‌. ఈ ట్రిక్ ఏదో బాగుంద‌ని అన్ని కాస్ట్యూమ్స్‌కి ఇదే ఫార్ములాని వాడుతున్నార‌ట‌. ఈ చిత్రం నుంచి త‌మిళ హీరో విజ‌య్ సేతుప‌తి త‌ప్పుకున్నాడంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ టీమ్ మాత్రం దీనిపై క్లారిటీ ఇవ్వ‌లేదు. దీంతో విజ‌య్ సేతుప‌తి ఈ చిత్రంలో న‌టిస్తున్నాడ‌నే అంతా అంటున్నారు. ఇక ఈ చిత్రంలోని కీల‌క పాత్ర‌ల్లో ప్ర‌కాష్‌రాజ్‌, జ‌గ‌ప‌తిబాబు, హ‌రీష్ ఉత్త‌మ‌న్‌, అన‌సూయ‌, వెన్నెల కిషోర్ న‌టిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All