Saturday, October 1, 2022
Homeటాప్ స్టోరీస్బ‌న్నీ `పుష్ప‌` టీమ్‌లో విషాదం!

బ‌న్నీ `పుష్ప‌` టీమ్‌లో విషాదం!

బ‌న్నీ `పుష్ప‌` టీమ్‌లో విషాదం!
బ‌న్నీ `పుష్ప‌` టీమ్‌లో విషాదం!

బ‌న్నీ హీరోగా న‌టిస్తున్న పాన్ ఇండియా స్థాయి చిత్రం `పుష్ప‌`. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ముత్యం శెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తోంది. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం తూర్పు గోదావ‌రి జిల్లాలోని మారేడుమిల్లి డీప్ ఫారెస్ట్‌లో జ‌రుగుతోంది.

- Advertisement -

న‌వంబ‌ర్‌లో చిత్ర బృందం మారేడుమిల్లి డీప్ ఫారెస్ట్‌లో షూటింగ్ మొద‌లుపెట్టింది. అయితే టీమ్‌లో కొంత మందికి స‌డ‌న్‌గా క‌రోనా సోకిన‌ట్టు తేల‌డంతో షూటింగ్‌ని ఆపేశారు. టీమ్ మొత్తం హైద‌రాబాద్ తిరిగి వ‌చ్చేసింది. మ‌ళ్లీ ఇటీవ‌లే మారేడుమిల్లిలో షూటింగ్ మొద‌లుపెట్టారు. తాజాగా ఈ చిత్ర షూటింగ్ లొకేష‌న్‌లో స్టిల్ ఫొటోగ్రాఫ‌ర్ శ్రీ‌నివాస్‌కు గుండెపోటు వ‌చ్చిందంట‌.

విష‌యం గ్ర‌హించిన యూనిట్ స‌భ్యులు అత‌న్ని అంబులెన్స్‌లో స‌మీప ఆసుప‌త్రికి త‌ర‌లించే ప్ర‌య‌త్నం చేశారు. కానీ మార్గ మ‌ధ్య‌లోనే అత‌ను గుండెపోటుతో మృతి చెందార‌ని తెలిసింది. దీంతో `పుష్ప‌` టీమ్‌లో విషాదం నెల‌కొంది. 200ల‌కు పైగా చిత్రాల‌కు శ్రీ‌నివాస్ స్టిల్ ఫొటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేశారు. అత‌నికి ఓ భార్య ఇద్ద‌రు అమ్మాయిలు వున్నారు.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts