Homeన్యూస్పుష్ప స్పెషల్ సాంగ్ షూట్ షురూ

పుష్ప స్పెషల్ సాంగ్ షూట్ షురూ

పుష్ప స్పెషల్ సాంగ్ షూట్ షురూ
పుష్ప స్పెషల్ సాంగ్ షూట్ షురూ

సుకుమార్ సినిమాల్లో ఐటెం సాంగ్/ స్పెషల్ సాంగ్స్ ఎంత ప్రత్యేకంగా ఉంటాయో అన్న విషయం తెల్సిందే. తన మొదటి సినిమా ఆర్య నుండి లాస్ట్ రంగస్థలం వరకూ ప్రతీ సినిమాలో ఐటెం సాంగ్ కూడా చార్ట్ బస్టర్ సక్సెస్ అయింది. ఇక ప్రస్తుతం సుకుమార్ తెరకెక్కిస్తోన్న పుష్ప ది రైజ్ లో కూడా అదిరిపోయే స్పెషల్ సాంగ్ ఉంటుందని తెలుస్తోంది. సుకుమార్ ఇప్పటివరకూ చేసిన అన్ని సినిమాలకూ దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా పనిచేసాడన్న విషయం తెల్సిందే. వాళ్ళిద్దరి మధ్యా ఉన్న ర్యాపో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇక పుష్ప ది రైజ్ స్పెషల్ సాంగ్ లో హీరోయిన్ ఎవరన్న దానికి టీమ్ క్లారిటీ ఇచ్చిన విషయం కూడా తెల్సిందే. సమంత ఈ స్పెషల్ సాంగ్ లో ఆడిపాడనుంది. ఇక ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ ఈరోజు నుండి మొదలైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ఒక స్పెషల్ సెట్ లో షూటింగ్ జరుగుతోంది. బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య నృత్యాలను కంపోజ్ చేస్తున్నట్లు సమాచారం.

- Advertisement -

పుష్ప ది రైజ్ లో రష్మిక హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెల్సిందే. ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్ 17న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా కన్ఫర్మ్ చేసారు. ప్రస్తుతం ప్రమోషన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

పుష్ప ట్రైలర్ డైలాగ్స్ దద్దరిల్లిపోవాల్సిందే..!

డిసెంబర్ మొదటి వారంలోనే పుష్ప ట్రైలర్ రిలీజ్

పుష్ప: సమంత సాంగ్ షూటింగ్ ఎప్పటినుండి అంటే?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All