
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న లేటెస్ట్ చిత్రం పుష్ప. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దీన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తోన్న విషయం తెల్సిందే. ఈ చిత్రం నుండి ఇప్పటికే ఒక పాట విడుదలైంది. దాక్కో దాక్కో మేక చార్ట్ బస్టర్ గా నిలిచిన విషయం తెల్సిందే. ఇక ఇప్పుడు రెండో పాట విడుదలైంది. పుష్ప నుండి శ్రీవల్లి సాంగ్ ను కొద్దిసేపటి క్రితం విడుదల చేసారు.
దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో సిద్ శ్రీరామ్ ఈ పాట పాడటంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. దానికి తగ్గట్లుగానే ఈ సాంగ్ ఉందని చెప్పాలి. ముఖ్యంగా ఈ సాంగ్ హుక్ లైన్ చూపే బంగారమాయెనే శ్రీవల్లి మరింత ఆకట్టుకునేలా ఉంది. ఇదే ఈ సాంగ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళుతుంది. అయితే లిరిక్స్ విషయంలో కొంత నిరుత్సాహం కనిపిస్తుంది.
సాధారణంగా చంద్రబోస్ సాహిత్యం అంటే ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ పాట కూడా పర్వాలేదు కానీ సాహిత్యం మరీ సాధారణంగా అనిపిస్తుంది. అయితే సిద్ శ్రీరామ్ వాయిస్ లో మ్యాజిక్, దేవి శ్రీ ప్రసాద్ ఇన్స్ట్రుమెంటేషన్ దాన్ని కప్పిపుచ్చాయి. ఇక అల్లు అర్జున్, రష్మిక జోడి ఈ సాంగ్ లో అదిరింది.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం డిసెంబర్ 17న మొత్తం ఐదు భాషల్లో విడుదలవుతోన్న సంగతి తెల్సిందే.