
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – రష్మిక కలయికలో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గత ఏడాది డిసెంబర్ లో విడుదలైంది. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన ఈ మూవీ..రీసెంట్ గా బుల్లితెర ఫై ప్రసారమై..అత్యధిక టిఆర్పి రేటింగ్ సాధించి వార్తల్లో నిలిచింది.
ఇటీవల పుష్ప హిందీ వెర్షన్ ని టెలివిజన్ లో ప్రీమియర్ గా ప్రదర్శించారు. పుష్ప తో పాటు ఇతర ఛానల్స్ లో అక్షయ్ కుమార్ సూర్య వంశీ, రణ్ వీర్ సింగ్ 83 చిత్రాలు కూడా అదే సమయంలో టివిలో ప్రదర్శించారు. అక్షయ్ కుమార్, రణ్ వీర్ సింగ్ హిందీలో స్టార్ హీరోలు అయినా కానీ ఊహించని విధంగా అల్లు అర్జున్ పుష్ప చిత్రం ఈ రెండు చిత్రాల టీఆర్పీని అధికమించి అగ్ర స్థానంలో నిలిచింది. హిందీ స్పీకింగ్ మార్కెట్ అర్బన్ ప్రాంతంలో పుష్ప చిత్రానికి 4.35 టీవీఆర్ నమోదైంది. సూర్య వంశీ చిత్రాన్ని 2.7, రణ్వీర్ 83 చిత్రానికి 1. 7 టీవీఆర్ మాత్రమే నమోదయ్యాయి. అలాగే హిందీ స్పీకింగ్ మార్కెట్ రూరల్ రీజియన్ లో కూడా పుష్ప రికార్డు సృష్టించింది. పుష్ప చిత్రానికి 3.7 టీవీఆర్ నమోదు కాగా.. సూర్యవంశీ 3.1.. 83 చిత్రానికి కేవలం 2. 1 టీవీఆర్ నమోదు అయ్యాయి. ఇక ప్రస్తుతం పుష్ప 2 త్వరలో సెట్స్ పైకి రానుంది.