
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న చిత్రం పుష్ప. ఒక్క ఐటమ్ సాంగ్ తప్ప ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిందని తెలుస్తోంది. నవంబర్ మూడో వారంలో ఆ పాటను షూట్ చేయాలని షెడ్యూల్ చేసుకున్నారు. ఇక డిసెంబర్ 17న పుష్ప విడుదలవుతోంది. హిందీ రిలీజ్ పై నెలకొన్న కన్ఫ్యూజన్ కు కూడా తెరపడింది. పుష్ప హిందీలో కూడా విడుదలవుతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతోంది కాబట్టి ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్ లో జరుగుతున్నాయి.
పుష్ప నుండి మూడు పాటలు విడుదలవ్వగా మూడింటికీ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు నాలుగో పాటకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. నవంబర్ 19న పుష్ప నాలుగో సింగిల్ విడుదల కానుంది. “ఏ బిడ్డ ఇది నా అడ్డా” అంటూ సాగే పాటను ఆ రోజు విడుదల చేయనున్నారు.
అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న నటిస్తోన్న ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా సుకుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోన్న విషయం తెల్సిందే.
Also Read:
అల్లు అర్జున్ కు టిఎస్ఆర్టీసీ లీగల్ నోటీసులు..!
అల్లు ఫామ్ హౌస్ లో దీపావళి సెలబ్రేషన్స్..!
పుష్ప నుండి సామీ సాంగ్ ప్రోమో.. అదుర్స్..!
#PushpaFourthSingle on 19th NOV#EyyBiddaIdhiNaaAdda #EyyBetaIdhuEnPatta #EyyPodaIthuNjaanaada #EyyMagaIdhuNanJaaga #EyyBiddaYeMeraAdda#PushpaTheRise #PushpaTheRiseOnDec17@alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @MythriOfficial @adityamusic pic.twitter.com/m7rACVtmJf
— BA Raju’s Team (@baraju_SuperHit) November 14, 2021