
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప ది రైజ్ పై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా సాంగ్స్ కు వస్తోన్న రెస్పాన్స్ అమోఘం. దాక్కో దాక్కో మేక నుండి మొదలైన పుష్ప ది రైజ్ సంగీత ప్రయాణం ఇప్పుడు ఫోర్త్ సింగిల్ ఏ బిడ్డ ఇది నా అడ్డా వద్దకు చేరింది. మొదటి మూడు సాంగ్స్ ఒకదాన్ని మించి మరొకటి సూపర్ హిట్స్ అందుకున్నాయి.
ఇక ఈరోజు నాలుగో పాట ఏ బిడ్డ ఇది నా అడ్డా విడుదలైంది. పుష్ప ది రైజ్ టైటిల్ కు తగ్గట్లుగానే ఒక మాములు ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే డ్రైవర్ నుండి ఆ క్రైమ్ బిజినెస్ కింగ్ పిన్ గా మారిన పుష్పరాజ్ దాన్ని సెలబ్రేట్ చేసుకునే మూమెంట్ లో ఈ పాట వస్తుందని అర్ధమవుతోంది. చంద్రబోస్ అందించిన సాహిత్యం చాలా బాగుంది. దేవి శ్రీ ప్రసాద్ ట్యూన్ భిన్నంగా ఉంది. ఒక రెగ్యులర్ ఫార్మాట్ లో లేదు. ఇక నకాష్ అజిజ్ తన పవర్ఫుల్ వాయిస్ తో ఈ సాంగ్ కు డెప్త్ ను తీసుకొచ్చాడు.
సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న పుష్ప ది రైజ్ ఇంకా ఐటెం సాంగ్ చిత్రీకరణను పూర్తి చేయాల్సి ఉంది. సమంత ఈ సాంగ్ లో అల్లు అర్జున్ తో ఆడిపాడనుంది.
ఇవి కూడా చదవండి:
మెగా ట్రీట్: నెల రోజుల్లో నాలుగు మెగా సినిమాల క్లాష్
పుష్ప తమిళ్ రైట్స్ ను చేజిక్కించుకున్న లైకా!!
పుష్ప: సమంత రెమ్యునరేషన్ వింటే మతి పోవాల్సిందే
Make way for the Swagger with some noise ??#EyyBiddaIdhiNaaAdda Song Out Now!
– https://t.co/0CcaCieCmS#PushpaFourthSingle ?#PushpaTheRise #PushpaTheRiseOnDec17@alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @AzizNakash @boselyricist @adityamusic @MythriOfficial pic.twitter.com/HhPH7m4Un3
— Pushpa (@PushpaMovie) November 19, 2021
