
సుకుమార్ – అల్లు అర్జున్ కలయికలో వచ్చిన పుష్ప పార్ట్ 1 ఎంత పెద్ద విజయం సాధించిందో తెలియంది కాదు..పాన్ ఇండియా గా విడుదలై అన్ని భాషల్లో భారీ వసూళ్లు రాబట్టి ఆకట్టుకుంది. మార్చి చివరి వారంలో సెకండ్ పార్ట్ సెట్స్ పైకి వెళ్ళబోతున్నట్లు మొన్నటి వరకు వినిపించాయి కానీ ఇప్పుడు చిత్ర మేకర్స్ ప్లానింగ్ ను మార్చరట.
మే లేదా జూన్ నెలలో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని మేకర్స్ భావిస్తున్నారట. సినిమా సెట్స్ పైకి ఎప్పుడు వెళ్లిన కానీ డిసెంబర్ లో మాత్రం సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని గట్టిగా చెపుతున్నారు. ఫస్ట్ పార్టులో ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ, అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటించగా..స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. మరి రెండో పార్ట్ లో ఇంకెవరైనా చేరతారా చూడాలి.
- Advertisement -