Sunday, August 14, 2022
Homeటాప్ స్టోరీస్ఫైటర్ పై ఒక్క స్పీచ్ తో అంచనాల్ని పెంచేసిన పూరి

ఫైటర్ పై ఒక్క స్పీచ్ తో అంచనాల్ని పెంచేసిన పూరి

Puri Jagannath
Puri Jagannath

వరస ప్లాపులతో సతమతమైన పూరి జగన్నాథ్ ఓ రేంజ్ బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ తో కొట్టాడు. ఈ సినిమా సాధించిన విజయంతో తన పనైపోయిందనుకున్న వాళ్లకు దిమ్మతిరిగే రేంజ్ లో సమాధానం చెప్పినట్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరి జగన్నాథ్ ఎక్కువ ఆలస్యం చేయకుండా విజయ్ దేవరకొండతో తన తర్వాతి చిత్రముంటుందని ప్రకటించేశాడు. ఈ ప్రకటన విన్న వెంటనే మూవీ లవర్స్ కు భలేగా అనిపించింది.

- Advertisement -

హీరోలకు విభిన్నమైన క్యారెక్టరైజేషన్లు రాయడంలో పూరి సిద్ధహస్తుడు. ఆయన మూవీస్ ప్లాపై ఉండవచ్చు కానీ పూరి హీరో మాత్రం ఎప్పుడూ ప్లాప్ అవ్వలేదు. హీరోకు పూరి ఇచ్చే డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ అందరికీ తెగ నచ్చేస్తుంది. స్వతహాగా మంచి పెర్ఫార్మర్ అయిన విజయ్ దేవరకొండను పూరి ఎలా ప్రెజంట్ చేస్తాడన్న ఆసక్తి అందరిలోనూ కలిగింది. కాబట్టి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అనగానే విజయ్ లో సరికొత్త కోణాన్ని చూడబోతున్నామని అందరూ ఫీల్ అయ్యారు.

ఈ సినిమాకు ఫైటర్ అన్న టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ సినిమా షూటింగ్ ఎప్పటినుండి అన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు. పూరి ఈసారి స్క్రిప్ట్ ఫినిష్ చేయడానికి కొంచెం ఎక్కువ టైమ్ తీసుకోవడం ఒక కారణమైతే, విజయ్ దేవరకొండకు ఉన్న ముందు చిత్రాల కమిట్మెంట్స్ అసలు కారణం. కాబట్టి డిసెంబర్ లో కానీ వచ్చే ఏడాది కానీ చిత్ర షూటింగ్ మొదలవుతుంది. పూరి షూటింగ్ స్పీడ్ గురించి చెప్పేదేముంది.

సింగిల్ షెడ్యూల్ లో మూడే నెలల్లో సినిమా షూటింగ్ ను పూర్తి చేయగలడు. వచ్చే ఏప్రిల్ లో సినిమా విడుదల ఉంటుందనుకోవచ్చు. ఇదంతా పక్కనపెడితే విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి తీసిన చిత్రం మీకు మాత్రమే చెప్తా నవంబర్ 1న విడుదల కానున్న నేపథ్యంలో నిన్న రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఫంక్షన్ కు అతిధిగా విచ్చేసిన పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండతో తాను తీయబోయే చిత్రం గురించి చెప్పి అందరి అంచనాలను పెంచేసాడు.

తన స్పీచ్ ముగింపులో ఫైటర్ ఓ రేంజ్ లో ఉంటుంది అంటూ ముగించాడు. దీంతో తమ చిత్రానికి ఫైటర్ అన్న టైటిల్ కన్ఫర్మ్ అని చెప్పకనే చెప్పాడు. తర్వాత విజయ్ దేవరకొండతో పనిచేయాలని ఎప్పటినుండో చూస్తున్నానని, ఒకప్పుడు తన అసిస్టెంట్ గా చేసిన పరశురామ్ విజయ్ తో గీత గోవిందం చేస్తున్నప్పుడు చిత్ర విశేషాలను నాతో పంచుకునేవాడని, విజయ్ తో పనిచేయడం చాలా బాగుంటుందని, తనని కూడా పనిచేయమన్నాడని పూరి చెప్పుకొచ్చాడు.

ఇంకా మాట్లాడుతూ విజయ్ నాన్న గోవర్ధన్ తనకు ఎప్పటినుండో తెలుసని, మంచి మిత్రుడని, తనతో కలిసి పనిచేశానని చెప్పాడు పూరి. ఇలా మిత్రుడి కొడుకుతో సినిమా చేయడం చాలా బాగుందని కూడా అన్నాడు. మీకు మాత్రమే చెప్తా సినిమా ద్వారా ఈ కుటుంబానికి బోలెడు డబ్బులు, ఆనందం రావాలని ఆకాంక్షించాడు పూరి జగన్నాథ్. దర్శకుడైన తరుణ్ భాస్కర్, మీకు మాత్రమే చెప్తాలో హీరోగా చేసిన విషయం తెల్సిందే.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts