
దర్శకుడు పూరి జగన్నాథ్ ది భిన్నమైన వర్కింగ్ స్టైల్. అతను చాలా వేగంగా సినిమాలు చేస్తుంటాడు. అలాగే అనుకున్న బడ్జెట్ లో సినిమా పూర్తి చేయడం పూరి ప్రత్యేకత. అందుకే అతని సినిమాలు ప్లాప్ అయినా కూడా నిర్మాతలకు మాత్రం నష్టాలు కలిగించవు. టాలీవుడ్ లో టాప్ రేంజ్ లో ఉన్న పూరి జగన్నాథ్ ఇప్పుడు బాలీవుడ్ పై ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇస్మార్ట్ శంకర్ విజయం తర్వాత పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ చిత్రాన్ని చేస్తోన్న విషయం తెల్సిందే. ఇది హిందీ, తెలుగు ద్విభాషా చిత్రంగా రూపొందుతోంది. కరణ్ జోహార్ ఈ చిత్రానికి పార్ట్నర్ గా ఉన్నాడు. లైగర్ తర్వాత పూరి జగన్నాథ్ మరిన్ని ప్యాన్ ఇండియన్ సబ్జెక్ట్స్ పై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.
కరణ్ జోహార్ తో పూరి పలు దఫా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. తన దర్శకత్వంలో కరణ్ నిర్మాణంలో వరసగా ప్యాన్ ఇండియన్ సినిమాలు చేయాలన్నది ప్లాన్. కరణ్ కూడా పూరి వర్కింగ్ స్టైల్ కు ముగ్దుడైపోయినట్లు తెలుస్తోంది.