Homeగాసిప్స్చిరు గాడ్ ఫాదర్ కు.. పూరీ హెల్ప్..!

చిరు గాడ్ ఫాదర్ కు.. పూరీ హెల్ప్..!

Puri Jagannath Help for Chiranjeevi God Father Movie
 

మెగాస్టార్ చిరంజీవి కోలీవుడ్ డైరక్టర్ మోహన్ రాజా కాంబినేషన్ లో మళయాళ మూవీ లూసిఫర్ రీమేక్ గా ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా స్క్రిప్ట్ లో డ్యాషింగ్ డైర్కటర్ పూరీ జగన్నాథ్ కొన్ని మార్పులు సూచించాడట. పూరీ చెప్పిన మార్పులు నచ్చడంతో గాడ్ ఫాదర్ సినిమాకు పూరీ హెల్ప్ కూడా తీసుకుంటున్నారట చిరంజీవి. అసలైతే పూరీ డైరషన్ లో చిరు హీరోగా ఆటో జాని సినిమా రావాల్సి ఉంది. ఆ సినిమా కథ సెట్ అవక ప్రాజెక్ట్ హోల్డ్ లో పడ్డది.

ఇక ఇప్పుడు చిరు గాడ్ ఫాదర్ కోసం పూరీ పనిచేస్తున్నారని తెలుస్తుంది. ఇదే ఊపులో చిరుతో ఆటో జాని కథని కూడా పూరీ ఒప్పించేస్తాడేమో చూడాలి. పూరీ జగన్నాథ్ ఇన్వాల్వ్ అవుతున్నాడు అంటే ఖచ్చితంగా గాడ్ ఫాదర్ అంచనాలకు మించి ఉంటుందని చెప్పొచ్చు. గాడ్ ఫాదర్ తో పాటుగా మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ తో భోళా శంకర్.. కె.ఎస్ రవీంద్ర డైరక్షన్ లో ఒక సినిమా ఫిక్స్ చేసుకున్నాడని తెలిసిందే.

- Advertisement -

ఇక పూరీ జగన్నాథ్ విషయానికి వస్తే ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుండి వస్తున్న ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All