
మెగాస్టార్ చిరంజీవి – డాషింగ్ డైరెక్టర్ పూరి కలయికలో సినిమా రావాల్సి ఉండే..కానీ చివర్లో మిస్ అయ్యింది. ప్రస్తుతం చిరంజీవి వరుస రీమేక్ కథలతో బిజీ గా ఉండగా..పూరి విజయ్ దేవరకొండ తో వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం లైగర్ మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉండగానే..పూరి తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన చిత్రాన్ని విజయ్ తో చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్ర ప్రకటన కార్య క్రమంలో విజయ్ మాట్లాడుతూ..ఓ సంచలన సీక్రెట్ ను రివీల్ చేసాడు.
“పూరి గారు త్వరలో చిరు సార్‌తో కలిసి నటిస్తున్నారు. ఇప్పుడు వాళ్లిద్దరూ యాక్టింగ్ కొలిగ్స్” అంటూ మీడియా ముందు అసలు సీక్రెట్ బయటకు చెప్పేశాడు విజయ్. అయితే ఏ సినిమాలో అనేది చెప్పకుండా సస్పెన్స్ లో ఉంచాడు. ఇప్పుడు మెగా అభిమానులు ఏ సినిమాలో పూరి నటిస్తున్నాడా అని ఆరా తీయడం స్టార్ట్ చేసారు.