Homeటాప్ స్టోరీస్మా అన్నయ్య ని కొట్టేవారు ఇంకెవ్వరు ఉండరూ..

మా అన్నయ్య ని కొట్టేవారు ఇంకెవ్వరు ఉండరూ..

Puri Jagannadh
మా అన్నయ్య ని కొట్టేవారు ఇంకెవ్వరు ఉండరూ..

నిన్న విడుదల అయిన “సైరా నరసింహా రెడ్డి” ఆడియో రిలీజ్ పండగ.. ఇప్పుడు ఫిలిం నగర్ లో బాగా పాపులర్ అయ్యింది. వర్షం కారణముగా చాలా మనిషి సెలెబ్రెటీస్ రాలేదని సినిమా ఆడియో ఈవెంట్ ని ప్లాన్ చేసిన వారు అన్నారు. అలా ఈవెంట్ కి రాని వాళ్ళు తమ మద్దతుని మాధ్యమాల్లో పోస్ట్స్ చేస్తున్నారు.

మన డాషింగ్ డైరెక్టర్ ఇస్మార్ట్ “పూరి జగన్నాధ్” గారు కూడా లేటెస్ట్ గా ఒక వీడియో అప్లోడ్ చేశారు. అందులో పూరి జగన్నాధ్ గారు ఏమ్మన్నారంటే.. “చాలా ఏళ్ల క్రితం చర‌ణ్ నాతో అన్నాడు ‘నేను డాడీతో ఓ మెమొర‌బుల్ మూవీ తీయ్యాలి. అంద‌రూ ఫ్రౌడ్‌గా ఫీల్ కావాలన్నాడు’. సైరా టీజ‌ర్ చూశాను.. చూడ‌గానే నాకు చ‌ర‌ణ్ గుర్తుకొచ్చాడు. ఆరోజు ఎలా చెప్పాడో ఈరోజు సినిమాను అలాగే తీశాడు. గ్రాండియ‌ర్‌గా, విజువ‌ల్‌గా సినిమాను నిర్మించాడు. సురేంద‌ర్ రెడ్డి ఇర‌గొట్టేశాడు. ఇక అన్న‌య్య గురించి.. ఎనర్జీలో అన్న‌య్య‌ను కొట్టేటోడు మ‌ళ్లీ పుట్ట‌డు. ల‌వ్ యు అన్న‌య్య‌. సైరా చాలా పెద్ద హిట్ కావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని ట్విట్టర్ లో వీడియో పోస్ట్స్ చేసాడు.

- Advertisement -

సినిమా గురించి చెప్పాలంటే సినిమా చరిత్రలో ఎన్నడూ రానివిధంగా మెగా స్టార్ కి మద్దతు రావడంతో మెగా అభిమానులే కాదు ఇటు సినిమా ప్రియులు కూడా తెగ సంబర పడిపోతున్నారు.

భారీ అంచ‌నాలు న‌డుమ మెగాస్టార్ చిరంజీవి న‌టించిన చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి` అక్టోబ‌ర్ 2న విడుద‌ల‌వుతుంది. ఈ సినిమా కోసం మెగాభిమానులు, ప్రేక్ష‌కులే కాదు.. సినీ ప్ర‌ముఖులు కూడా ఎదురుచూస్తున్నారు. చూద్దాం మరి అక్టోబ‌ర్ 2న రామ్ చరణ్ గారి కల నెరవేరుతుందో?

Credit: FaceBook

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All