Homeటాప్ స్టోరీస్పంచ్ ప్రభాకర్ కి పంచ్ పడింది!

పంచ్ ప్రభాకర్ కి పంచ్ పడింది!

పంచ్ ప్రభాకర్ కి పంచ్ పడింది!
పంచ్ ప్రభాకర్ కి పంచ్ పడింది!

పంచ్ ప్రభాకర్ కి పంచ్ పడింది. సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ లో నిత్యం లైవ్ వీడియోలు చేస్తూ వైరల్ గా మారారు ఎన్నారై వెటర్నరీ డాక్టర్ చీనేపల్లి ప్రభాకర్ రెడ్డి. అధికార వైస్సార్ పార్టీకి వీర విధేయుడిగా ఉంటున్న ప్రభాకర్ రెడ్డి గత కొంత కాలంగా వైస్సార్సీపీ పై స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నారు.

వైస్సార్సీపీ ని ఎవరు విమర్శించినా వారిని ఫేస్ బుక్ వీడియోలతో చెడుగుడు ఆడేస్తున్నారు. చిత్తూరుకు చెందిన ఈయనగారు యుఎస్ లో వెటర్నరీ డాక్టర్ గా పనిచేస్తున్నారు. పంచ్ ప్రభాకర్ ప్రతి ఉదయం ఆఫీస్ కి వెళ్లే లోపు కార్ డ్రైవింగ్ చేస్తూనే ఫేస్ బుక్ లో సెటైర్లతో ఓ వీడియోని పెట్టేస్తుంటాడు. ఫేస్ బుక్ లో ఇతన్ని ఫాలో అయ్యేవాళ్ళ కంటే ఇప్పటి వరకు ఇతను పెట్టిన వీడియోలే ఎక్కువ.

- Advertisement -

ఇంతలా రెచ్చిపోయి వీడియోలు చేసే చీనేపల్లి ప్రభాకర్ రెడ్డి గత రెండు మూడు రోజులుగా వీడియోలు పోస్ట్ చేయడం లేదు. లైవ్ వీడియో లతో రచ్చ చేయడం లేదు. కారణం ఏంటా అని ఆరా తీస్తే యుఎస్ లో ఉంటున్న రెస్పాన్సిబుల్ ఇండియన్ సిటిజెన్ పంచ్ ప్రభాకర్ పిచ్చి వీడియోలపై నగర మేయర్ కు కంప్లైంట్ చేశారట. దాంతో అక్కడి సార్జంట్స్ వెళ్లి కార్ నడుపుతూ వీడియోలు చేయొద్దంటూ పంచ్ ప్రభాకర్ కు వార్నింగ్ ఇచ్చారట. దాంతో పంచ్ ప్రభాకర్ గత రెండు మూడు రోజులుగా డ్రైవింగ్ చేస్తూ ఫేస్ బుక్ వీడియోలు చేయడం లేదని తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All