Homeటాప్ స్టోరీస్బిగ్ బాస్ లోకి వెళ్లి తప్పు చేసిందట పున్నూ

బిగ్ బాస్ లోకి వెళ్లి తప్పు చేసిందట పున్నూ

బిగ్ బాస్ లోకి వెళ్లి తప్పు చేసిందట పున్నూ
బిగ్ బాస్ లోకి వెళ్లి తప్పు చేసిందట పున్నూ

పునర్నవి భూపాళం.. సోషల్ మీడియా ఫాలో అయ్యేవాళ్ళకు పరిచయం అవసరం లేని పేరు. అందం, అభినయం ఉన్నా అవకాశాలను చేజిక్కించుకోవడంలో వెనకపడుతోంది ఈ భామ. అయితే పునర్నవి గతేడాది బిగ్ బాస్ హౌజ్ లో పార్టిసిపేట్ చేసిన విషయం తెల్సిందే. బిగ్ బాస్ సీజన్ 3 లో కొన్ని వారాల పాటు పునర్నవి భూపాళం సేవ్ అయింది. అయితే బిగ్ బాస్ లో తాను చేసిన పనులకంటే రాహుల్ సిప్లిగంజ్ తో స్నేహం వల్లే ఆమె ఎక్కువగా పాపులర్ అయింది. హౌజ్ లో ఉన్నంతవరకూ ఇద్దరి మధ్యా ఏదో ఉందన్నట్లుగా కలరింగ్ ఇచ్చినా ఆ తర్వాత మేము జస్ట్ స్నేహితులం మాత్రమే అని అన్నారు.

ఇక పునర్నవి బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక తన కెరీర్ పూర్తిగా మారిపోతుందని ఊహించింది. అయితే అటువంటిదేం జరగలేదు. పాపులారిటీ అయితే వచ్చింది కానీ దానివల్ల ఆమెకు కలిసొచ్చింది పెద్దగా లేదు. పైగా కాంట్రవర్సీల్లో భాగం కావాల్సి వచ్చింది. అందుకేనేమో, బిగ్ బాస్ కు వెళ్లి తప్పు చేశానంటోంది పునర్నవి.

- Advertisement -

రీసెంట్ పున్నూకు సంబంధించిన ఒక ఫోటో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో ఉన్న దాని ప్రకారం, “బిగ్ బాస్ కు వెళ్లి ఏం నేర్చుకున్నావు పున్నూ అని అడిగితే, బిగ్ బాస్ కు వెళ్లకూడదని” అని రాసి ఉన్న అట్టముక్కను పట్టుకుంది పునర్నవి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All