బికినీ వేసుకోవడమంటే నాకు చాలా ఇష్టమని , అయినా బికినీ వేయడానికి సరైన ఫిజిక్ ఉండాలని అది నాదగ్గర ఉందని అందుకే బికినీ వేయడం అంటే నాకు మహా సరదా అని అంటోంది పూజా హెగ్డే . తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఈ భామకు సక్సెస్ అంతగా రాలేదు దాంతో అల్లు అర్జున్ సరసన నటించిన దువ్వాడ జగన్నాథం చిత్రంలో రెచ్చిపోయి బికినీ వేయడమే కాకుండా అందాలను ఆరబోసి పిచ్చెక్కించింది .
ఇక ఇప్పుడేమో ఏకంగా స్టార్ హీరోలు మహేష్ బాబు , ఎన్టీఆర్ , ప్రభాస్ ల సరసన నటించే ఛాన్స్ రావడంతో తాజాగా ఒకటి కాదు రెండు కాదు పలు రకాల బికినీలు వేసి ఫోటో షూట్ చేసింది . పూజా హెగ్డే బికినీ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి . దాంతో బికినీ గురించి ఈ భామని అడిగితే తెగ సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది …… అంటే బికినీ వేసి కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టడం అంటే పూజా హెగ్డే కు పిచ్చి అన్నమాట .