Homeటాప్ స్టోరీస్ప్రేక్ష‌కుల కోసం నిర్మాత‌ల కొత్త ప్లాన్‌!

ప్రేక్ష‌కుల కోసం నిర్మాత‌ల కొత్త ప్లాన్‌!

ప్రేక్ష‌కుల కోసం నిర్మాత‌ల కొత్త ప్లాన్‌!
ప్రేక్ష‌కుల కోసం నిర్మాత‌ల కొత్త ప్లాన్‌!

క‌రోనా వైర‌స్ కార‌ణంగా  అన్ని వ్య‌వ‌స్థ‌లు స్థంభించిపోయాయి. దీంతో సినీ ఇండ‌స్ట్రీ కూడా కార్య‌క‌లాపాల్ని ఆపేసింది. దీంతో న‌ష్టాలు భారీ స్థాయిలోనే వుండే ప్ర‌మాదం ఏర్ప‌డింది. కార్మికుల  క్షేమం  కోసం బంద్‌ని పూటించ‌క త‌ప్ప‌ని పరిస్థితి. ఇదిలా వుంటే సీనీ ఇండ‌స్ట్రీకి స‌మ్మ‌ర్ ఓ కాబ‌ధేనువు లాంటిది. ఈ సీజ‌న్‌లో రిలీజ్‌లు కూడా ఎక్కువే వుంటాయి. లాభాలు కూడా అద్య‌ధికంగానే వుండేవి. అయితే క‌రోనా కార‌ణంగా స‌మ్మ‌ర్ సీజ‌న్ మొత్తం తుడిచి పెట్టుకుపోయింది. మిగిలింది మే.

అయితే ఈ నెల 30 వ‌ర‌కు లాక్ డౌన్ పొడిగించ‌డంతో మే మొద‌టి వారంలో కూడా థియేట‌ర్లు ఓపెన్ చేసే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. రెండ‌వ వారం అయినా థియేట‌ర్ల‌కు వెసులు బాటు క‌ల్పిస్తే బాగుంటుంద‌ని, అలా క‌ల్పిస్తే ఎలాంటి నిర్ణ‌యాల్ని తీసుకోవాలో ఇప్ప‌టికే ఎగ్జిబిట‌ర్స్‌, డిస్ట్రిబ్యూట‌ర్స్ నిర్మాత‌లు ఓ ప్లాన్‌ని సిద్ధం చేశార‌ట‌.

- Advertisement -

అదేంటంటే ప్ర‌తి థియేట‌ర్‌లోనూ ప్రేక్ష‌కులు స‌మాజిక దూరం పాటించాలి కాబ‌ట్టి 50 శాతం టిక్కెట్ల‌ని మాత్ర‌మే సేల్ చేయాల‌ని అదే ఉత్త‌మ మైన మార్గ‌మ‌ని భావిస్తున్నార‌ట‌. ఈ ప్ర‌తి పాద‌న‌నను లాక్ డౌన్ ముగిసిన త‌రువాత ప్ర‌భుత్వం ముందు ఉంచ‌బోతున్నార‌ట‌. దీనికి ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే చిన్ని చిత్రాల్ని ముందు రిలీజ్ చేయాల‌నుకుంటున్నార‌ట‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All