ట్రెండ్ క్రియేట్ చేసే సినిమా నా ” హుషారు ” అని ధీమా వ్యక్తం చేస్తున్నాడు నిర్మాత బెక్కెం వేణుగోపాల్ . టాటా బిర్లా మధ్యలో లైలా వంటి చిత్రంతో నిర్మాతగా సక్సెస్ సాధించిన బెక్కెం హీరో శివాజీ మిత్రుడు కాగా అతడి సహకారంతో నిర్మాతగా మారి సక్సెస్ అయ్యాడు . ఆ సినిమా తర్వాత పలు చిత్రాలను నిర్మించినప్పటికీ గత రెండేళ్లుగా మాత్రం వరుస సక్సెస్ లను సాధిస్తూ మంచి జోరు మీదున్నాడు బెక్కెం .” సినిమా చూపిస్తా మావ ”, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ , నేను లోకల్ చిత్రాలతో సక్సెస్ లు కొట్టిన బెక్కెం వేణుగోపాల్ తాజాగా హర్ష కొనగంటి అనే కొత్త దర్శకుడ్ని తెలుగు చిత్ర సీమకు పరిచయం చేస్తున్నాడు .
హర్ష చెప్పిన కథ నచ్చడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ హుషారు చిత్రాన్ని నిర్మిస్తున్నాని , ఈ చిత్రం ట్రెండ్ క్రియేట్ చేస్తుందని అంత బాగా వచ్చిందని …… దాదాపుగా షూటింగ్ పార్ట్ అయిపొయింది పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరుగుతోందని జూన్ లో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు . అగ్ర నిర్మాతలు దగ్గుబాటి సురేష్ , దిల్ రాజు ల సహచర్యం తో సినిమా నిర్మాణంలో మరిన్ని మెళుకువలు నేర్చుకున్నానని …….. నేను సాధారణ స్థాయి నుండి ఈరోజు నిర్మాత స్థాయికి చేరుకోగలిగానంటే అది నా శ్రమతో పాటు అదృష్టం అని అన్నారు బెక్కెం వేణుగోపాల్ .