
టీవీ సీరియల్స్‌తో నటిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న శ్రావణి (26) అనుమానాస్పదంగా మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. మనసు మమత, మౌనరాగం సీరియల్స్‌లో నటించి మంచి పేరు తెచ్చుకున్న శ్రావణి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఆమెని ప్రేమించి సాయికృష్ణ కారణంగానే శ్రావణి ఆత్మహత్యకు పాల్పడిందని ఓ సారి లేదు దేవరాజ్ రెడ్డి వేధింపుల కారణంగానే మృతిచెందిందని మరో సారి వార్తలు వినిపించాయి.
అయితే శ్రావణి మృతికి దేరాజు రెడ్డి, సాయి కృష్ణ ఈ ఇద్దరూ కారణమేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కెరీర్ ప్రారంభం నుంచి అండగా వున్న సాయికృష్ణని కాదని శ్రావణి నటుడు దేవరాజు రెడ్డితో చనువుగా వుండటం, ఆ తరువాత సాయి కృష్ణ కు దేవరాజ్ రెడ్డికి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో ఇద్దరి గొడవ కారణంగానే శ్రావణి మృతి చెందిందని, శ్రావణి మృతికి దేవారాజ్‌రెడ్డి, సాయికృష్ణ ఇద్దరూ కారణమని వీరిని అదుపులోకి తీనుకున్నారట.
ఇక శ్రావణి ఆత్మ హత్య కేసులో అనుమానితుడిగా భావిస్తున్న `ఆర్ ఎక్స్ 100` ప్రొడ్యూసర్ అశోక్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తను ప్రస్తుతం పరారీలో వున్నారట. ఫోన్ కూడా స్విఛాఫ్ వస్తుండటంతో అతని కోసం పోలీసులు ప్రస్తుతం గాలిస్తున్నారు.