Homeటాప్ స్టోరీస్`టాక్సీవాలా` హీరోయిన్ సెకండ్ ఫిల్మ్ షురూ!

`టాక్సీవాలా` హీరోయిన్ సెకండ్ ఫిల్మ్ షురూ!

`టాక్సీవాలా` హీరోయిన్ సెకండ్ ఫిల్మ్ షురూ!
`టాక్సీవాలా` హీరోయిన్ సెకండ్ ఫిల్మ్ షురూ!

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా రాహుల్ సంక్రీత్య‌న్ రూపొందించిన థ్రిల్లర్ ఎంట‌ర్‌టైన‌ర్ టాక్సీవాలా`. కొత్త త‌ర‌హా క‌థ‌తో రూపొందిన ఈ చిత్రం ద్వారా ప్రియాంక జ‌వాల్క‌ర్ హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైంది. తొలి చిత్రంతోనే మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది కానీ త‌న క్రేజ్‌కి త‌గ్గ‌ట్టుగా అవకాశాల్ని మాత్రం పొంద‌లేక‌పోయింది. తాగా ఆమె న‌టిస్తున్న సెకండ్ మూవీ బుధ‌వారం హైద‌రాబాద్‌లో మొద‌లైంది.

`రాజా వారు రాణిగారు` చిత్రంలో హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం. తొలి సినిమాతో మంచి పేరు తెచ్చ‌కున్న ఆయ‌న తాజాగా మ‌రో చిత్రాన్ని మొద‌లుపెట్టారు. ఇందులో ప్రియాంక జ‌వాల్క‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఎలైట్ గ్రూప్ నిర్మిస్తున్న ఈ చిత్ర తొలి స‌న్నివేశానికి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే శ్రీ‌కాంత్‌రెడ్డి క్లాప్ నిచ్చారు.

- Advertisement -

ఈ సినిమాతో శ్రీ‌ధ‌ర్ గ‌దె ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. డైలాగ్ కింగ్ సాయికుమార్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రానికి `ఆర్ ఎక్స్ 100` ఫేమ్ చేత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ నెలాఖ‌రు నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. కీల‌క పాత్ర‌ల్లో తుల‌సి, శ్రీ‌కాంత్, క‌శ్య‌ప్ శ్రీ‌నివాస్‌, అరుణ్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All