Homeటాప్ స్టోరీస్`విరాట‌ప‌ర్వం`లో ప్రియ‌మ‌ణి పాత్ర ఇదే!

`విరాట‌ప‌ర్వం`లో ప్రియ‌మ‌ణి పాత్ర ఇదే!

`విరాట‌ప‌ర్వం`లో ప్రియ‌మ‌ణి పాత్ర ఇదే!
`విరాట‌ప‌ర్వం`లో ప్రియ‌మ‌ణి పాత్ర ఇదే!

`నీది నాదీ ఒకే క‌థ‌` అంటూ తొలి చిత్రంతోనే ఆలోచింప‌జేసిన ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల. ఈ సినిమాతో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని అందుకుని తొలి విజ‌యాన్ని సొంతం చేసుకున్న ఈ యంగ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `విరాటం ప‌ర్వం`. రానా, సాయి ప‌ల్ల‌వి హీరో హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. డి. సురేష్‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రీయ‌మ‌ణి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ రోజు (గురువారం) ఆమె పుట్టిన రోజు ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం ప్రియ‌మ‌ణి పాత్ర‌కి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేశారు.

ఈ చిత్రంలో ఆమె ఏ పాత్ర‌లో న‌టిస్తున్నార‌న్న‌ది ఇంత వ‌ర‌కు బ‌య‌ట‌పెట్ట‌ని చిత్ర బృందం తాజాగా ఆమె పాత్ర పేరుతో పాటు ఆమె ఎలాంటి పాత్ర‌లో క‌నిపించ‌బోతోంద‌న్న‌ది రివీల్ చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. దీనికితోడు చిత్ర బృందం ఓ క్యాప్ష‌న్ ని కూడా ఇచ్చింది. సినిమాలో ఆమె పాత్ర‌కున్న ప్రాధాన్య‌త ఏ స్థాయిలో వుంటుందో చిన్న హింట్ ఇస్తూ  `మహా సంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారి తీస్తుందని ఆమె నమ్మింది. ఫ్రెంచ్ రెవల్యూషన్లో స్టూడెంట్స్ పాత్ర ఎంత కీలకమో `విరాట ప‌ర్వం`‌ లో ‘కామ్రేడ్ భారతక్క’ కూడా అంతే కీలకం` అని ఆస‌క్తిక‌ర‌మైన క్యాప్ష‌న్ ఇచ్చింది.

- Advertisement -

ప్రియ‌‌మ‌ణి ఈ చిత్రంలో న‌‌క్స‌లైట్ పాత్ర‌లో కామ్రేడ్ భార‌త‌క్క‌గా క‌నిపించ‌నుంది. సాయి ప‌ల్ల‌వి ప‌ల్లెల్లో విప్ల‌వ గీతాలు ఆల‌పించే జ‌న‌ప‌ద గాయ‌కురాలిగా క‌నిపించ‌నుంద‌ని ఇప్ప‌టికే ప్ర‌చారం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. బాలీవుడ్ న‌టి నందితా దాస్ మ‌రో కీల‌క పాత్ర‌ని పోషిస్తున్న ఈ చిత్రాన్ని త్వ‌ర‌లోనే ప్రేఞ‌కుల ముందుకు తీసుకురావాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All