Homeగాసిప్స్ప్రియా వారియ‌ర్‌కి బంప‌ర్ ఆఫ‌ర్‌!

ప్రియా వారియ‌ర్‌కి బంప‌ర్ ఆఫ‌ర్‌!

ప్రియా వారియ‌ర్‌కి బంప‌ర్ ఆఫ‌ర్‌!
ప్రియా వారియ‌ర్‌కి బంప‌ర్ ఆఫ‌ర్‌!

ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్.. సోష‌ల్ మీడియాలో తొలి సినిమా రిలీజ్‌కి ముందే సెన్సేష‌న్ క్రియేట్ చేసి వార్త‌ల్లో నిలిచింది. మ‌ల‌యాళ చిత్రం `ఒరు ఆడార్ ల‌వ్‌` పేరుతో రూపొందిన చిత్రం ద్వారా మ‌ల‌యాళ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ వింక్ వీడియోతో దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించి పాపుల‌ర్ అయింది.

ఇదే చిత్రాన్ని తెలుగులో `ల‌వ‌ర్స్ డే` పేరుతో రిలీజ్ చేశారు. వింక్ వీడియోతో పాపుల‌ర్ అయిన ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ ఆ స్థాయిలో మాత్రం అవ‌కాశాల్ని ద‌క్కించుకోలేక‌పోయింది. బంప‌ర్ ఆఫ‌ర్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌కు తాజాగా బంప‌ర్ ఆఫ‌ర్ ల‌భించిన‌ట్టు తెలిసింది. తెలుగులో నితిన్ హీరో చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రంలో న‌టిస్తున్న ప్రియా ఆకాష్ వారియ‌ర్‌కు తెలుగులో మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ ల‌భించింది.

- Advertisement -

మ‌హేష్ హీరోగా ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీమేక‌ర్స్ ఓ భారీ చిత్రాన్ని నిర్మించ‌బోనున్న విష‌యం తెలిసిందే. త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి రానున్న ఈ చిత్రం కోసం ఓ హీరోయిన్‌గా ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌ని ఎంపిక చేసే ఆలోచ‌న‌లో వున్నార‌ట‌. లాక్‌డౌన్ త‌రువాత ఆడిష‌న్ నిర్వ‌హించాకే ఫైన‌ల్‌గా నిర్ణ‌యం తీసుకోనున్నార‌ని తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All