
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – శృతి హాసన్ జంటగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ సలార్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో పోషిస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పృథ్వీరాజ్ మాట్లాడుతూ..సలార్ తాలూకా కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకొని అభిమానుల్లో అంచనాలు రెట్టింపు చేసారు.
ప్రశాంత్‌నీల్, హోంబలే ఫిల్మ్స్ సంస్థతో నాకు మంచి అనుబంధం ఉంది. ‘సలార్’ పట్టాలెక్కించాలని నిర్ణయించుకున్నప్పుడు గతేడాది ప్రశాంత్‌నీల్ నన్ను కలిశారు. ‘సలార్’లో ఓ కీలక పాత్ర ఉందని, చేయాలని కోరారు. కథ విన్నాను. ఆ పాత్ర నాకు బాగా నచ్చింది. దాంతో సినిమా చేస్తానని చెప్పాను. అనుకోని కారణాల వల్ల ఆ సినిమా షూటింగ్ వాయిదా పడటం, అదే సమయంలో నా కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కడంతో డేట్స్ సర్దుబాటు కాక సలార్’ చేయలేనని ప్రశాంత్‌తో చెప్పేశాను. ఆ తర్వాత ప్రభాస్, ప్రశాంత్ నన్ను కలిశారు. సినిమా చేయాలని కోరారు. నా ప్రాజెక్ట్ పూర్తైన వెంటనే ఆ సినిమాలో భాగమవ్వాలని నిర్ణయించుకున్నాను. అలా, నేను మళ్లీ ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చాను’’ అని తెలిపాడు. మరి పట్టుబడి ప్రభాస్ – ప్రశాంత్ ఈయన్ను పెట్టుకున్నారంటే..ఈయన పాత్ర ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.